AP DGP: ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా ఉన్న ద్వారకా తిరుమల రావు త్వరలో రిటైర్మెంట్ కానున్నారు. ప్రస్తుతం ఏపీ డీజీపీతో పాటు ఆర్టీసీ ఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పదవీవిరమణ తర్వాత ఆయన్ను ఆ పోస్టులో కొనసాగించే అవకాశాలున్నాయని వార్థులొస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో హరీష్ గుప్తాను ఎన్నికల సంఘం డీజీపీగా నియమించింది. దీంతో కొన్నిరోజుల పాటు ఆయన ఆ పోస్టులో కొనసాగారు.
ఇక ఆంధ్ర ప్రదేశ్ లో 2024లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక తిరుమలరావును డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా నియమించింది. ఆయన పదవీవిరమణ చేశాక సీనియారిటీ జాబితాలో 1991 బ్యాచ్‌కు చెందిన అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ మొదటి స్థానంలో ఉంటారు. హరీష్ గుప్తా రెండోస్థానంలో ఉన్నారు.మరి సీనియారిటీ పక్కన పెట్టి హరీష్ కుమార్ గుప్తాను కొత్త డీజీపీగా నియమిస్తారా లేదా చూడాలి.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
గత ఎన్నికల్లో అధికారంలో ఉన్న వైసీపీని ఇబ్బంది పెట్టడంలో కీ రూల్ పోషించారు. అంతేకాదు ఏపీలో జరిగిన ఎన్నికల్లో పారదర్శకంగా వ్యవహరించడం మూలానా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పైగా అప్పటి వైసీపీ నేతలను చుక్కలు చూపించారు. ఒక రకంగా ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంతో ఎన్నికల కమిషనర్ గా ఆయన పాత్ర ఉంది. అందుకే కూటమి ప్రభుత్వం ఆయనవైపు మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా.. శాంతి భద్రతల విషయంలో ఎంతో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ కుమార్ గుప్తా కొత్త డీజీపీ గా ఆయన ముందు పెను సవాళ్లే ఉన్నాయి.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.