Right to Education: ఏపీ ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత అడ్మిషన్ల కోసం పేద, వెనుకబడిన వర్గాల విద్యార్ధుల్నించి దరఖాస్తులు కోరుతోంది. దీనికి సంబంధించి ఏపీ విద్యా శాఖ నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. వివిధ ప్రైవేట్ స్కూళ్లకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎన్ని సీట్లున్నాయనే వివరాలు నోటిపికేషన్‌లో ఉన్నాయి.
వాస్తవానికి విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లను పేద, వెనుకబడివర్గాలకు కేటాయించాల్సి ఉంటుంది. ఈ చట్టాన్ని ఏపీ ప్రభుత్వమే తొలిసారిగా అమలు చేస్తోంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేయడంతో రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫ్రీ సీట్ల కేటాయింపు ప్రారంభం కానుంది. అర్హులైన విద్యార్ధులు ఈ నెల 23 నుంచి మార్చ్ 14 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యా హక్కు చట్టం 2024-25 కవిద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో పేద పిల్లలకు ఉచిత అడ్మిషన్లు లభించనున్నాయి.
విపత్కర పరిస్థితుల్లో ఉన్న అనాథలు, హెచ్ఐవీ బాధితులు, విభిన్న ప్రతిభావంతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల పిల్లలకు విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్లలో ఉచితంగా అడ్మిషన్లు లబించనున్నాయి. రాష్ట్రంలోని ప్రైవేట్, అన్ ఎయిడెడ్ స్కూళ్లలో 25 శాతం సీట్లను పేద పిల్లలకు కేటాయించనున్నారు. ఫిబ్రవరి 23 నుంచి మార్చ్ 14 వరకూ ఆధార్ కార్డు, పుట్టిన తేదీ, ఇతర వివరాలతో http://cse.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఉచిత సీట్ల వివరాలు ఇంకా తెలుసుకోవాలంటే 18004258599 టోల్ ఫ్రీ ద్వారా తెలుసుకోవచ్చు. స్క్రీనింగ్ అనంతరం అర్హత మేరకు ఆయా విద్యార్ధులకు సీట్ల కేటాయింపు ఉంటుంది.
Also read: AP Fibernet Scam: ఫైబర్‌నెట్ కేసులో ఏ1గా చంద్రబాబు, ఛార్జిషీటు దాఖలు చేసిన సీఐడీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook