APPSC: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కొత్త ఛైర్మన్‌గా ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ నియామకం జరిగింది. డీజీపీ బాథ్యతల్నించి తొలగించిన తరువాత ప్రభుత్వం కొత్త బాథ్యతలు అప్పగించింది.
ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్‌పై ప్రభుత్వం ఒక్కసారిగా వేటు వేసింది. డీజీపీగా గౌతమ్ సవాంగ్‌ను తొలగిస్తూ..ఆదేశాలు జారీ చేసింది. ఇన్‌ఛార్జ్ డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించింది. డీజీపీగా తొలగించిన తరువాత రెండ్రోజుల వరకూ ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. ఇవాళ గౌతమ్ సవాంగ్‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఛైర్మన్‌గా ఉన్న ఉదయ్ భాస్కర్ పదవీకాలం ఆరు నెలల క్రితమే పూర్తి కాగా..అప్పట్నించి ఖాళీగా ఉంది.
1986 బ్యాచ్‌కు చెందిన గౌతమ్ సవాంగ్ చిత్తూరు జిల్లా మదనపల్లె ఏఎస్పీగా ఉద్యోగాన్ని ప్రారంభించారు. అనంతరం చిత్తూరు, వరంగల్ ఎస్పీగా పనిచేశారు. 2001 నుంచి 2003 వరకూ వరంగల్ రేంజ్ డీఐజీగా, 2003 నుంచి 2004 వరకూ స్పెషల్ బ్రాంచ్ డీఐజీగా పని చేశారు. 2004 నుంచి 2005 వరకూ ఏపీఎస్పీ డీఐజీగా బాధ్యతలు నిర్వహించిన గౌతమ్ సవాంగ్ 2005 నుంచి 2008 వరకూ సీఆర్పీఎఫ్ డీఐజీగా చేశారు. ఆ తరువాత 2008 నుంచి 2009 వరకూ లా అండ్ ఆర్డర్ ఐజీగా వ్యవహరించారు. 2016-2018 వరకూ విజయవాడ పోలీస్ కమీషనర్‌గా, 2018లో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా చేశారు. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తరువాత ఏపీ డీజీపీగా బాథ్యతలు చేపట్టారు. వాస్తవానికి గౌతమ్ సవాంగ్‌కు (Goutam Sawang) 2023 జూలై వరకూ సర్వీసు ఉంది. అయితే ఇటీవల కొద్దికాలంగా ఆయనపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడలో జరిగిన ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె విజయవంతమైన తరువాత ప్రభుత్వం ఆయనపై ఆగ్రహంగా ఉందనే వార్తలు విన్పించాయి. ఈ చర్చ కొనసాగుతుండగానే ఆయనపై వేటు పడింది. ఇప్పుడు రెండ్రోజుల తరువాత ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించింది.
Also read: AP Hijab Row: ఏపీలోనూ హిజాబ్ దుమారం.. హిజాబీ విద్యార్థినులను అనుమతించని లయోలా కాలేజీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook