Ap Deputy cm pawan kalyan meets with Karnataka cm Siddaramaiah: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కర్ణాటకకు వెళ్లారు. ఆయన తొలుత బెంగళూరులో సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు.అక్కడ కొన్ని అంశాలపై చర్చించారు. అదే విధంగా ఈ భేటీలో కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శ్రీ ఈశ్వర్ బి. ఖంద్రే గారితో చర్చలు జరిగిపట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. ఏపీలో తరచుగా.. చిత్తూరు జిల్లా పరిధిలోను, పార్వతీపురం ప్రాంతంలోను ఏనుగులు ఊళ్ళ మీదకు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి. ప్రాణ హాని కలిగిస్తున్నాయి. ఏనుగులు గ్రామాల మీదకు దాడిచేస్తు.. మరల అడవికి పోకుండా బీభత్సం చేస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. ఈ నేపథ్యంలో.. ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు అవసరమని పవన్ కల్యాణ్ సీఎం సిద్ధరామయ్య, అటవీ శాఖ మంత్రితో చర్చించినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా కర్ణాటకలో కుంకీ ఏనుగులకు చిన్న ప్పటి నుంచి మావటి వాళ్లు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తుంటారు. ఇవి ముఖ్యంగా అడవి నుంచి గ్రామాల్లోకి వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేస్తుంటాయి. కుంకీ ఏనుగులు కర్ణాటక దగ్గర ఉన్నాయి. కొన్ని కుంకీ ఏనుగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేలా కర్ణాటక అటవీ శాఖను కోరినట్లు తెలుస్తోంది. దీనిపైన కర్ణాటక ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. కర్ణాటక ప్రభుత్వంతో వన్య ప్రాణి, అటవీ సంరక్షణ అంశాలపై చర్చించేందుకు బెంగళూరు చేరుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కర్ణాటక ప్రభుత్వ ప్రతినిధులు సాదరంగా స్వాగతం పలికారు. ఆ రాష్ట్ర బయో ఎనర్జీ డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్ శ్రీ సురేంద్ర, బోర్డు సలహాదారు శ్రీ భరత్ సుబ్రహ్మణ్యం తదితరులు స్వాగతం పలికారు.
ఏపీలో కూటమి అధికారంలో వచ్చినప్పటి నుంచి ఒక వైపు సీఎం చంద్రబాబు, మరోవైపు.. పవన్ కల్యాణ్ అధికారంలో వచ్చినప్పటి నుంచి పాలనలో తనదైన మార్కును చూపిస్తున్నారు. ఎక్కడ కూడా రాజీలేకుండా ఏపీకి పూర్వవైభకం చేకూర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. దీని కోసం తము శ్రమించడమే కాకుండా.. అధికారులను కూడా పరుగులు పెట్టిస్తున్నారు.
ప్రజలకు మేలు చేసే పనుల్లో ఏమాత్రం నెగ్లీజెన్సీ చూపించి వదిలే ప్రసక్తిలేదని సీఎం చంద్రబాబు ఇప్పటికే పలు మార్లు అధికారులకు హెచ్చరించారు. ప్రజల కోసం, ఏపీపూర్వ వైభవం కోసం ఎంతవరకైన వెళ్తామని కూడా కూటమి పలుమార్లు కూటమి స్పష్టం చేసింది.ఈ క్రమంలో కుంకీ ఏనుగుల కోసం డిప్యూటీ సీఎం పొరుగున ఉన్న కర్ణాటకు వెళ్లడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనితో పాటు.. అడవిలో గంధపు చెక్కల స్మగ్లింగ్ వంటి వాటిని చూస్తు ఊరుకొవద్దని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీనికోసం ప్రత్యేకంగా చర్యలు కూడా చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter