CM Jagan Tweet: ప్రజల ఆశీస్సులే శ్రీరామరక్ష..ఆత్మకూరు విజయంపై సీఎం జగన్‌ ఆసక్తికర ట్వీట్..!

CM Jagan Tweet: ఏపీలో వైసీపీ హవా కొనసాగుతోంది. ఏ ఎన్నికలు జరిగినా..అధికారపార్టీకే విజయం వరిస్తోంది. ఇటీవల జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లోనూ తిరుగులేని మెజార్టీని వైసీపీ సాధించింది.

Written by - Alla Swamy | Last Updated : Jun 26, 2022, 06:15 PM IST
  • ఏపీలో వైసీపీ హవా
  • ఆత్మకూరు ఉప ఎన్నికలోనూ విజయ ఢంకా
  • బీజేపీ అభ్యర్థిపై ఘన విజయం
CM Jagan Tweet: ప్రజల ఆశీస్సులే శ్రీరామరక్ష..ఆత్మకూరు విజయంపై సీఎం జగన్‌ ఆసక్తికర ట్వీట్..!

CM Jagan Tweet: ఏపీలో వైసీపీ హవా కొనసాగుతోంది. ఏ ఎన్నికలు జరిగినా..అధికారపార్టీకే విజయం వరిస్తోంది. ఇటీవల జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లోనూ తిరుగులేని మెజార్టీని వైసీపీ సాధించింది. తాజాగా ఆత్మకూరు ఉప ఎన్నికలోనూ విజయ ఢంకా మోగించింది.  బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్ యాదవ్‌పై 82 వేల 742 ఓట్ల మెజార్టీతో మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఘన విజయం సాధించారు.

ఆత్మకూరు విజయంపై సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులతో మరో మంచి విజయం సాధించామన్నారు. ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్‌కు నివాళిగా..ఆత్మకూరులో 82 వేలకు పైగా భారీ మెజార్టీతో విక్రమ్‌ను గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, అందరీ ఆశీస్సులే శ్రీరామరక్ష అని అన్నారు. ఈమేరకు సీఎం జగన్ ట్వీట్ చేశారు.

ఆత్మకూరు ఉప ఎన్నిక కౌంటింగ్‌లో ఆది నుంచి విక్రమ్‌ రెడ్డి ఆధిపత్యం చెలాయించారు. మొదటి రౌండ్‌లోనే ఐదు వేలకు పైగా మెజార్టీ సాధించారు. అప్పటి నుంచి ప్రతి రౌండ్‌లో అదరగొట్టారు. బీజేపీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ దక్కలేదు. బీఎస్పీ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు. నోటాకు నాలుగు వేలకుపైగా ఓట్లు వచ్చాయి. టీడీపీ ఎన్నికలకు దూరంగా ఉంది. మొత్తంగా 20 రౌండ్ల లెక్కింపులో వైసీపీ అభ్యర్థి విక్రమ్‌కు లక్షా 2 వేల 74 ఓట్ల వచ్చాయి. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌కు 19 వేల 332 ఓట్లు పడ్డాయి.

Also read: Bandi Sanjay: ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి..తెలంగాణ ప్రజలకు బండి సంజయ్‌ పిలుపు..!

Also read:Ranji Trophy 2021-22: రంజీ ట్రోఫీని ముద్దాడిన మధ్యప్రదేశ్‌..ఆటగాళ్ల భావోద్వేగం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News