Kodi Kathi Srinivas Joins In Jai Bheem Bharath Party: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు మరింత హీట్ ను పుట్టిస్తున్నాయి. ఇప్పటికే వైఎస్సార్పీపీ సింగిల్ గా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఆయా స్థానాలలో అభ్యర్థులను కూడా ఖరారు చేసింది. ఇదిలా ఉండగా.. టీడీపీ, బీజేపీ, జనసేనలు కలసి ఎన్నికల బరిలో దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరి మధ్య పొత్తు కుదిరింది. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా సింగిల్ గా పోటీకి దిగుతుంది. ఇక తాజాగా, కాపు నేత ముద్రగడ వైఎస్సార్పీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఏపీ రాజకీయాలలో రసవత్తరంగా మారాయి. పార్టీలన్ని నువ్వా.. నేనా.. అన్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. తాజాగా, గత ఎన్నికలకు ముందు సీఎం జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో కోడికత్తితో హత్యకు ప్రయ్నతించిన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ (కోడికత్తి శ్రీను) జైభీమ్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అదే విధంగా..గతంలో వివేక హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి సైతం ఇదే పార్టీలో గతంలో చేరడం కూడా వార్తలలో నిలిచింది.
కోడికత్తి శ్రీనివాస్ అమలాపురం నుంచి ఎన్నికల బరిలో ఉంటారని జైభీమ్ పార్టీ ప్రెసిడెంట్ శ్రవణ్ తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రవణ్ మాట్లాడుతూ.. ఒక దళిత బిడ్డ, ప్రతి బహుజన బిడ్డ, అందరు సంతోషంగా ఉండాలి.. ప్రతిఒక్కరికి ఉపాధి లభించాలి.. అందరు తమ సొంత కాళ్ల మీద నిలబడాలని, శ్రీనివాస్ ఎప్పుడు పరితపిస్తుంటాడన్నారు. నిజంగా ఒక తమ్ముడిగా.. అణగారిన వర్గాల జాతీలో పుట్టిన బిడ్డగా గర్విస్తున్నాన్నారు.
ఇప్పుడు.. దగాపడ్డ ఒక ఎందరో బిడ్డలలో కోడికత్తి శ్రీనివాస్ అన్నారు. ప్రస్తుతం ఇది కోర్టుపరిధిలో (సీఎం జగన్ పై హత్యయత్నంన) ఉంది. కాబట్టి దీనిపై మాట్లాడట్లేదన్నారు. రాజకీయాలనేవి కుట్రలు, కుతంత్రాలతో చేయడం మంచిది కాదన్నారు. ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి రావాలన్నారు. ఇప్పటికైన ప్రజలు ఆలోచించి మంచి వారిని తమ నాయకుడిగా ఎన్నుకోవాలని కోరారు.
కొన్నిరోజుల క్రితమే వివేక హత్య కేసులో ప్రధాన నిందితుడైన దస్తగిరి కూడా జైభీమ్ పార్టీలో చేరారు. అంతేకాకుండా.. తన తండ్రిపై జరిగిన దాడులను ఖండిస్తూ.. దమ్ముంటే తనపై దాడిచేయాలని అమాయకుడైన తన తండ్రిపై దాడిచేయడం ఏంటని దస్తగిరి సవాల్ విసిరారు.
ఇక.. మరోవైపు వివేకా కూతురు సునీతా సైతం రాజకీయాల్లోకి రానున్నట్లు సమాచారం. కానీ ఆమె ఏ పార్టీలో చేరుతారో అనేది మాత్రం ఇంకా కన్ఫామ్ కాలేదు. ఇక... జగన్ మోహన్ రెడ్డిని, వైఎస్ షర్మిలా విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మరోవైపు జగన్ తాను.. అర్జునుడి వలే.. అపోసిషన్ పార్టీలన్ని కలిసి ఒక్కటైన.. పద్మవ్యూహం ఛేదిస్తానని సిద్ధం సభల ద్వారా ప్రజలకు తమదైన స్టైల్ లో భరోసా ఇస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook