AP-Odisha Border Issue: ఏళ్ల తరబడి వివాదం. ఏపీ, ఒడిశా సరిహద్దులోని గ్రామాల పరిధి నిర్ణయించే సమస్య. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిసారిగా ఆ సమస్యపై స్పందించారు. గ్రామస్థులేమంటున్నారు..ఏ రాష్ట్రంలో కలవాలనుకుంటున్నారు. అసలీ కధ ఏంటనేది పరిశీలిద్దాం..
ఆంధ్రప్రదేశ్-ఒడిశా(Ap-Odisha Border)సరిహద్దులోని సాలూరు నియోజకవర్గ పరిధిలోని 5 గ్రామ పంచాయితీల పరిధిలో 34 కొటియా గ్రూపు గ్రామాల వివాదం సుదీర్ఘకాలంగా నలుగుతోంది. దాదాపు 15 వేలమంది జనాభాలో 3 వేల 813 మంది ఒడిశాలో ఓటర్లుగా ఉన్నారు.1936వ సంవత్సరంలో ఒడిశా రాష్ట్రం ఏర్పాటైనప్పుడు కానీ లేదా 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు కానీ ఈ ప్రాంతంలో సర్వే చేయకపోవడంతో సమస్య పెండింగ్‌లో ఉండిపోయింది. ఏ రాష్ట్రమూ అంతర్భాగంగా గుర్తించలేదు. ఫలితంగా ఈ గ్రామాల కోసం రెండు రాష్ట్రాలు 1968 నుంచి న్యాయ పోరాటం చేస్తున్నాయి. అయితే ఈ వివాదాన్ని పార్లమెంట్‌లో తేల్చుకోవాలని, అంతవరకూ ఏ విధమైన ఆక్రమణ చర్యలకు పాల్పడవద్దని 2006లోనే న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. అయితే ఈ గ్రామస్థులంతా ఏపీకు చెందినవారే అనేందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయి. భూమి శిస్తు చెల్లింపుకు సంబంధించి తామ్రపత్రాల్ని ఇటీవల కొటియా ప్రజలు ప్రదర్శించారు. వారి పిల్లలు కూడా సాలూరు మండలంలోని కురుకూటి, అంటివలస, కొత్తవలస గ్రామాల్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్య అభ్యసిస్తున్నారు.
ఈ గ్రామస్థులందరికీ రాష్ట్ర ప్రభుత్వం(Ap Government) మంజూరు చేసిన రేషన్ కార్డులతో పాటు ఏపీ చిరునామాతో ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి. పూర్వీకుల్నించి ఆంధ్ర ఆచార సంప్రదాయాల్నే పాటిస్తున్నందున..ఏపీకు చెందినవారుగా గుర్తించాలంటూ ఆ 16 గ్రామాల కొటియా ప్రజలు తీర్మానం కూడా చేశారు. ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan) పాలనపై విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో సంక్షేమ ఫలాలు అందుతున్నాయని..అందుకే ఒడిశాలో చేరమని చెబుతున్నారు. మరోవైపు ఈ సమస్యపై తొలిసారిగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు జరిపారు.ఇరువురి మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయని తెలుస్తోంది. ఏళ్ల తరబడి నలుగుతున్న ఈ సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుందని సమాచారం.
Also read: AP CM YS JAGAN: బ్రేకింగ్ న్యూస్, ముందస్తు ఎన్నికలకు వైఎస్ జగన్, ఇక నిత్యం ప్రజల్లోనే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
AP-Odisha Border Issue: ఆ పదహారు గ్రామాల పయనం ఎటు, ఏపీలోనా లేదా ఒడిశాలోనా
ఏపీ ఒడిశా రాష్ట్రాల మధ్య ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కొటియా గ్రామాల సమస్య
ఏపీలోనే ఉంటున్నామని తీర్మానాలు చేస్తున్న పదహారు గ్రామాల ప్రజలు
కొటియా గ్రామాల ప్రజల మధ్య తొలిసారిగా చర్చలు జరిపిన ఏపీ ఒడిశా ముఖ్యమంత్రులు