AP 10th Class Exams: ఏపీలో పదో తరగతి పరీక్షల తీరుపై దుమారం..మరోసారి పేపర్ లీక్..!

AP 10th Class Exams: ఏపీలో పదోతరగతి పరీక్షలు జరుగుతున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. మొన్నటివరకు ప్రశ్నాపత్రాల లీక్‌ తీవ్ర కలకలం రేపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. కొన్ని చోట్ల పరీక్ష ప్రారంభానికి ముందే ప్రశ్నాపత్రాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. మరికొన్ని చోట్ల పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత వాట్సాప్‌ స్టేటస్‌లో కనిపించాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 3, 2022, 07:28 AM IST
  • ఏపీలో పదోతరగతి పరీక్షల తీరుపై విమర్శలు
  • వరుసగా ప్రశ్నాపత్రాలు లీక్
  • విద్యార్థులకు స్లిప్‌లు పంచిన యువకుడు
  • విచారణకు ఆదేశించిన విద్యా శాఖ
AP 10th Class Exams: ఏపీలో పదో తరగతి పరీక్షల తీరుపై దుమారం..మరోసారి పేపర్ లీక్..!

AP 10th Class Exams: ఏపీలో పదోతరగతి పరీక్షలు జరుగుతున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. మొన్నటివరకు ప్రశ్నాపత్రాల లీక్‌ తీవ్ర కలకలం రేపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. కొన్ని చోట్ల పరీక్ష ప్రారంభానికి ముందే ప్రశ్నాపత్రాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. మరికొన్ని చోట్ల పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత వాట్సాప్‌ స్టేటస్‌లో కనిపించాయి. దీనిపై పెను దుమారం రేగింది. సీరియస్‌గా తీసుకున్న విద్యా శాఖ, పోలీసులు పలువురిని అరెస్ట్‌లు చేశారు. బాధ్యులైన ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేసింది. ప్రశ్నాపత్రాల లీక్‌తో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. 

నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో ప్రశ్నాపత్రాల లీక్‌ ఘటనలు మరవకముందే కర్నూలు జిల్లాలో ఓ యువకుడు చేసిన పని హాట్ టాపిక్‌గా మారింది. ఆలూరులోని సెయింట్ జాన్స్‌ స్కూల్‌లో టెన్త్ పరీక్షలు జరుగుతున్నాయి. విద్యార్థులకు ఓ యువకుడు స్లిప్‌లు అందజేసే విజువల్స్ కనిపించాయి. స్కూల్‌ వెనుక వైపు  నుంచి విద్యార్థులకు స్లిప్పులు అందించే ప్రయత్నం చేశాడు. ఇది చూసిన ఉపాధ్యాయులు, అధికారులు, పోలీసులు ఏమి పట్టనట్లు వ్యవహరించారు. వారి కనుసైగల్లోనే యువకుడు అలా ప్రవర్తించి ఉంటాడన్న అనుమానాలు కల్గుతున్నాయి. అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

మరోవైపు ఆలూరులోని మరో స్కూల్‌లో పేపర్ లీక్ అయ్యింది. పరీక్షకు ముందే ప్రశ్నాపత్రం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. స్కూల్ నిర్వాహకులే ఇలా చేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ సుధీర్‌ కుమార్‌ రెడ్డి స్వయంగా విచారణ చేపట్టారు. ఇలాంటి వాటిని సహించేది లేదని స్పష్టం చేశారు. నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవన్నారు. పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చూస్తామన్నారు. 

వరుస ఘటనలపై ఏపీ ప్రభుత్వం(AP GOVT) సైతం సీరియస్ అయ్యింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి..తమకు నివేదిక ఇవ్వాలని అధికారులను విద్యా శాఖ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇటు సీఎం జగన్(CM JAGAN) సైతం ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. పరీక్షల ఆరంభం నుంచి ప్రశ్నాలపత్రాలు లీక్‌ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 
 

Also read:Horoscope Today May 3 2022: రాశి ఫలాలు... ఆ రాశి వారు రియల్ ఎస్టేట్ జోలికి వెళ్లకపోవడం ఉత్తమం..

Also read:SARKAARU VAARI PAATA : సీఎం జగన్‌ డైలాగ్‌తో క్రేజ్ పెంచిన మహేష్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News