Anakapalle King Cobra: అనకాపల్లిలో 14 అడుగుల కింగ్ కోబ్రా హల్చల్.. స్నేక్ క్యాచర్‌లకి 2 గంటలు చుక్కలు చూపిందిగా!

14 feet King Cobra stirs in Anakapalle Palm oil plantation. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలోని పామాయిల్​ తోటలో దాదాపుగా 14 అడుగుల కింగ్ కోబ్రా హల్చల్ చేసింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 27, 2022, 12:55 PM IST
  • అనకాపల్లిలో 14 అడుగుల కింగ్ కోబ్రా హల్చల్
  • స్నేక్ క్యాచర్‌లకి 2 గంటలు చుక్కలు చూపిందిగా
  • వీడియో చూస్తే షాక్ అవ్వడం పక్కా
Anakapalle King Cobra: అనకాపల్లిలో 14 అడుగుల కింగ్ కోబ్రా హల్చల్.. స్నేక్ క్యాచర్‌లకి 2 గంటలు చుక్కలు చూపిందిగా!

Snake Catchers caught 14 feet King Cobra in Anakapalle Palm oil plantation: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాలో భారీ కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో దాదాపుగా 14 అడుగుల కింగ్ కోబ్రా హల్చల్ చేసింది. పని కోసం పామాయిల్​ తోటకు వెళ్లిన కూలీలు దాన్ని చూసి ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. భారీ కింగ్​ కోబ్రాను చూసి భయంతో తోట నుంచి బయటకు పరుగులు తీశారు. అనంతరం స్నేక్‌ క్యాచర్స్​ వచ్చి.. నానా తంటాలు పడి దాన్ని పట్టుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయంలోకి వెళితే... 

మాడుగుల మండలం శంకరం పంచాయతీ భవానిపురం గ్రామ నివాసి అయిన చిన్నారావు అనే రైతు పామాయిల్ తోట ఉంది. కూలీలు తోటలో పామాయిల్ గెలలను కోస్తున్నారు. కూలీలు గెలలు కొస్తుండగా.. కింగ్ కోబ్రా కనిపించింది. భారీ పామును చూసిన కూలీలు భయభ్రాంతులతో తోట నుంచి బయటికి పరుగులు తీశారు. యజమాని చిన్నారావు వెంటనే స్నేక్​ క్యాచర్స్​కు సమాచారం అందించాడు. స్నేక్​ క్యాచర్స్ వెంకటేష్, మూర్తి కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు తోటకు వచ్చారు. 

కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు స్నేక్​ క్యాచర్స్ చాలా కష్టపడ్డారు. కాటేయడానికి మీదికి దూసుకొచ్చిన వారు వెనక్కి తగ్గలేదు. కింగ్ కోబ్రా కూడా వారికి చిక్కకుండా తప్పించుకుంది. రెండు గంటల పాటు స్నేక్​ క్యాచర్స్ శ్రమించి.. చివరకు సంచిలో కింగ్ కోబ్రాను బంధిస్తారు. అనంతరం వంట్లమామిడి సమీపంలోని అటవీ ప్రాంతంలో దాన్ని విడిచిపెట్టారు. దీంతో పామాయిల్ తోట యజమాని చిన్నారావు,  కూలీలు ఊపిరి పీల్చుకున్నారు. కింగ్ కోబ్రా 14 అడుగుల పొడవు, 11 కిలోల బరువు ఉంటుందని స్నేక్​ క్యాచర్స్ తెలిపారు.

Also Read: Punjab DA Hike: 'దీపావళి' ధమాకా ఆఫర్‌.. ప్రభుత్వ ఉద్యోగులకు 6 శాతం డీఏ!

Also Read: రాశీ ఖన్నా స్టన్నింగ్ స్టిల్స్.. స్లిమ్ లుక్‌లో పిచ్చెక్కించిన ఢిల్లీ అందం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News