AP: కోడ్ దాటుకుని..ప్రారంభమైన అమ్మఒడి పథకం

ఎన్నికల కోడ్ ఆంక్షలు..ప్రభుత్వ పట్టుదల మధ్య ఉత్కంఠ కల్గించింది అమ్మఒడి రెండో విడత పథకం. అనుకున్న సమయానికే ముఖ్యమంత్రి చేతుల మీదుగా అమ్మఒడి పథకం ప్రారంభమైంది.

Last Updated : Jan 11, 2021, 02:59 PM IST
AP: కోడ్ దాటుకుని..ప్రారంభమైన అమ్మఒడి పథకం

ఎన్నికల కోడ్ ఆంక్షలు..ప్రభుత్వ పట్టుదల మధ్య ఉత్కంఠ కల్గించింది అమ్మఒడి రెండో విడత పథకం. అనుకున్న సమయానికే ముఖ్యమంత్రి చేతుల మీదుగా అమ్మఒడి పథకం ప్రారంభమైంది.

జనవరి 8 రాత్రి హఠాత్తుగా వెలువడిన పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ ( Election Schedule ) ‌తో అమ్మఒడి పథకంపై ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే షెడ్యూల్‌తో పాటు సంక్షేమ పథకాల్ని నిలిపివేయాల్సిందిగా ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Nimmagadda Ramesh kumar ) ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో పండుగ పూట అమ్మఒడి ( Ammavodi ) డబ్బులపై ఆశలు పెట్టుకున్న తల్లులకు ఆందోళన కల్గింది. అయితే ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం, హైకోర్టు ( High court ) లో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేయడం పరిణామాల నేపధ్యంలో అమ్మఒడి పథకం అమలవుతుందే లేదా అనే సందేహం ఏర్పడింది.

అయితే ప్రజల్లో నెలకొన్న ఈ సందిగ్దతను తొలగిస్తూ..పథకం కచ్చితంగా ప్రారంభమవుతుందని మంత్రులు వెల్లడించారు. దీనికి తగ్గట్టుగానే ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా నెల్లూరు నుంచి పథకం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల 48 వేల 865 మంది తల్లుల ఖాతాల్లోకి..అమ్మఒడి పథకం కింద మొత్తం 6 వేల 673 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. పండుగ పూట తల్లుల ముఖంలో ఆనందం వికసించింది.

ప్రభుత్వ చేస్తున్న అభివృద్ధి, చేస్తున్న సంక్షేమ పథకాల్ని చూసి ఓర్వలేక కడుపుమంటతో ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) మండిపడ్డారు. రథాల్ని తగలబెట్టి రథయాత్రలు చేస్తున్నారని..సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియకూడదనే ఈ తరహా పనులకు పాల్పడుతున్నారన్నారు. దేవుడిపై భక్తి లేనివారు, ఆలయాల భూముల్ని కాజేసిన వ్యక్తులు, ఆలయాల్లో క్షుద్రపూజలు చేసినవారు..దేవుడిపై ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. 

Also read: AP: నేషనల్ హెల్త్ మిషన్ అమలులో ఏపీనే టాప్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News