టీడీపీ ఎంపీలు సభకు హాజరవ్వాల్సిందే: విప్ జారీ

తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంటు సమావేశం పూర్తయ్యేవరకూ సభకు ఎట్టిపరిస్థితుల్లోనూ గైర్హాజరు కాకూడదని.. అందరూ తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని తెదేపా విప్ చేసింది.

Last Updated : Mar 19, 2018, 12:13 AM IST
టీడీపీ ఎంపీలు సభకు హాజరవ్వాల్సిందే: విప్ జారీ

తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంటు సమావేశం పూర్తయ్యేవరకూ సభకు ఎట్టిపరిస్థితుల్లోనూ గైర్హాజరు కాకూడదని.. అందరూ తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని తెదేపా విప్ చేసింది. ముఖ్యంగా కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పరిస్థితులు అంత సుముఖంగా లేనందున.. అందరూ కలిసికట్టుగా ఉండాలని కూడా తెలిపినట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ శుక్రవారం నాడు ఎన్డీఏ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా.. ఆర్డరు లేకపోవడంతో స్పీకరు పరిగణనలోకి తీసుకోవడం లేదని చెప్పారు. ఈ క్రమంలో సోమవారం మళ్లీ ఈ తీర్మానం సభ దగ్గరకు వచ్చే సూచనలుననాయి కాబట్టి.. ఎంపీలు గైర్హాజరు కాకూడదని పార్టీ సిగ్నల్స్ పంపింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు, సమాజ్ వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీలు కూడా ఈ అవిశ్వాస తీర్మానానికి తాము సపోర్టు ఇస్తున్నట్లు ప్రకటించాయి.

Trending News