షాకింగ్ న్యూస్ ; పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన విలన్ !

                                     

Last Updated : Oct 13, 2018, 07:29 PM IST
షాకింగ్ న్యూస్ ; పొలిటికల్ ఎంట్రీపై  క్లారిటీ ఇచ్చిన విలన్ !

ఆయన బయటకు వస్తే జనాలకు హడల్ .... అడ్డొచ్చిన వారిని చితకబాదడమే ఆయన హాబీ ..అలాంటి వ్యక్తి మీడియా ముందుకు వచ్చి తాను పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నానని తెలిపాడు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తానని ప్రకటించారు.

ఆశ్చర్యపోకండి.. ఆయన విలన్ సినిమాల్లో మాత్రమే.. నిజ జీవితంలో సున్నితమైన మనస్తత్వం గల వ్యక్తి .. ఆయనే మన అశోక్ కుమార్. ఒసేయ్ రాములమ్మ మూవీతో పాటు అనేక టాలీవుడ్ సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన అశోక్ కుమార్..తనది పసుపు రక్తం..ఎప్పటికయినా టీడీపీ నుంచే పోటీ చేస్తానంటున్నారు.. 

ఓ ప్రముఖ మీడియాలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నానని ప్రకటించారు. సీఎం చంద్రబాబు పిలిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తన మనసులో మాటను బయటపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర పార్టీలు కూడా తనకు ఆఫర్ ఇచ్చాయి.. కానీ వాటిని కాదనుకున్నానని పేర్కొన్నారు. దూర దృష్టి తో పాటు గ్రేట్ విజన్ ఉన్న నేత చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడానికి తాను ఇష్టపడుతున్నానని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. 2014లోనే పోటీ చేద్దామనుకున్నానని కొన్ని కారణాల వల్ల ఆగిపోయానని .. ఈ సారి ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని అశోక్ కుమార్ పేర్కొనడం గమనార్హం

నటుడు అశోక్ కుమార్ కు దిగ్గజ నిర్మాత రామానాయుడికి  దగ్గరి బంధువుకావడం, సినీ గ్లామర్ ఉండటం వంటి కారణాలు వల్ల ఆయకు తప్పకుండా టికెట్ లభిస్తుందని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తుంది . అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.

.

 

Trending News