కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్య.. ఊహించని ట్విస్ట్

Man Commits Suicide | ఏపీలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో దాదాపు వంద కరోనా మరణాలు సంభవించాయి. కేసుల తీవ్రత సైతం కేవలం రెండు, మూడు జిల్లాల్లో దారుణంగా ఉంది. ఈ క్రమంలో కరోనా సోకిందేమోనన్న భయంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

Last Updated : Jul 10, 2020, 12:41 PM IST
కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్య.. ఊహించని ట్విస్ట్

Kurnool Man Commits Suicide: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ (CoronaVirus) తీవ్రత కర్నూలు జిల్లాలో అధికంగా ఉంది. ఆ జిల్లాలో కరోనాతో ఇప్పటివరకూ 91 మంది మరణించారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. తనకు కరోనా సోకిందేమోనన్న భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అనూహ్యంగా కోవిడ్19 టెస్టుల్లో అతడికి నెగిటివ్ రావడం గమనార్హం.  ఆ అల్లుడు చాలా లక్కీ.. నెటిజన్ల రియాక్షన్ వైరల్

కర్నూలు పాతబస్తీ కేవీఆర్‌ గార్డెన్‌ ప్రాంతంలో స్వర్ణకారుడు హుస్సేన్ నివాసం ఉంటున్నాడు. ఆ వృత్తితో ఉపాధి పొందుతూ భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడిని పోషిస్తున్నాడు.  ఉన్నారు. లాక్‌డౌన్ కారణంగా కొన్ని నెలులుగా హుస్సేన్ ఉపాధి లేక ఇంట్లోనే ఉంటున్నాడు. ఇటీవల కాస్త అస్వస్థతకు గురైన హుస్సేన్ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లాడు. కరోనా కేసులు జిల్లాలో అధికంగా ఉన్నాయని ఎందుకైనా మంచిది, కరోనా పరీక్షలు చేపించుకోవాలని డాక్టర్ సూచించాడు.  RGV సెక్సీ హీరోయిన్ Apsara Rani హాట్ ఫొటోలు వైరల్ 

ప్రైవేట్ ల్యాబ్‌కు వెళ్లి శాంపిల్స్ ఇచ్చాడు. ఈ క్రమంలో టెస్టు రిపోర్టుల కోసం కుటుంబసభ్యులు ఆస్పత్రికి వచ్చారు. స్నానం చేసి త్వరగా వచ్చేస్తానంటూ ఇంటికి వెళ్లిన హుస్సేన్ తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు ఇంటికెళ్లి చూడగా అప్పటికే హుస్సేన్ ఉరివేసుకుని చనిపోయాడు. అయితే కోవిడ్19 ఫలితాలలో బాధితుడికి నెగటివ్‌గా తేలింది. కానీ కచ్చితంగా పాజిటివ్ వస్తుందన్న భయంతో ఇంటి పెద్ద బలవన్మరణం చెందడంతో కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos

Trending News