Lock Down: మూడేళ్లుగా లాక్ డౌన్ లో కుటుంబం.. స్నానం చేయకపోవడంతో దుర్వాసన! అనంతపురంలో దారుణం

Covid Lock Down: అనంతపురంలో ఓ కుటుంబం మూడేళ్లుగా లాక్ డౌన్ లో ఉండిపోయింది. వాళ్ల ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు వెళ్లి చూడగా ఈ ఘటన వెలుగు చూసింది

Written by - Srisailam | Last Updated : Sep 17, 2022, 09:55 AM IST
Lock Down: మూడేళ్లుగా లాక్ డౌన్ లో కుటుంబం.. స్నానం చేయకపోవడంతో దుర్వాసన! అనంతపురంలో దారుణం

Covid Lock Down: మూడేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తోంది కొవిడ్ మహమ్మారి. కొవిడ్ కారణంగా 2020లో తొలిసారి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దాదాపు మూడు వారాల పాటు దేశ మొత్తం లాకైంది. సెకండ్ వేవ్ లో కొన్ని రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. ఇక రాష్ట్రాలు తమ పరిధిలో వచ్చిన కొవిడ్ కేసుల తీవ్రత ఆధారంగా స్థానికంగా లాక్ డౌన్ విధించుకున్నాయి. కొవిడ్ మహమ్మారి ప్రభావం ఎన్ని రంగాలపై పడింది. ప్రజా జీవితాలను ప్రభావితం చేసింది. కొవిడ్ కారణంగా లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొవిడ్ తీవ్రత తగ్గినా.. దాని తాలుకా చేదు జ్ఞాపకాలు మాత్రమే కళ్ల ముందే కనిపిస్తున్నాయి. పోస్ట్ కొవిడ్ సమస్యలతో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో వెలుగుచూసిన ఘటన అందిరిని షాక్ కు గురి చేసింది.

అనంతపురంలో ఓ కుటుంబం మూడేళ్లుగా లాక్ డౌన్ లో ఉండిపోయింది. వాళ్ల ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు వెళ్లి చూడగా ఈ ఘటన వెలుగు చూసింది.  మూడేళ్లుగా ఇంటిలోనే ఉంటున్న కుటుంబ సభ్యులు స్నానం కూడా సరిగా చేయడం లేదని తెలుస్తోంది. శుభ్రత పాటించకపోవడంతో చూడటానికి భయానకంగా కనిపించారు.  లాక్ డౌన్ లో ఉంటున్న ఇంటికి రెండేళ్లుగా కరెంట్ కూడా లేదు. అన్నతో పాచటు ఇద్దరు చెల్లెళ్లు ఆ ఇంటిలో ఉంటున్నారు. అయితే అన్న మాత్రమే రోజుకు ఒకసారి ఇంటి నుంచి బయటికి వెళ్లి నీరు, భోజనం తీసుకెళ్లేవారని స్థానికులు చెబుతున్నారు. అతని ఇద్దరు చెల్లెళ్లు మాత్రం గత మూడేళ్ల నుంచి ఒక్కసారి కూడా బయిటి రాలేదట. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుంది.

Read Also: Rao Ramesh Great Heart: పర్సనల్ మేకేప్ మేన్ కుటుంబానికి అండగా రావు రమేష్..

Read Also: Hyderabad Liberation day: విలీనమా.. విమోచనమా.. విద్రోహమా? సెప్టెంబర్‌ 17న అసలేం జరిగింది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News