అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 572కు చేరుకుంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు శుక్రవారం ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. మొత్తం 572 కేసులకుగానూ చికిత్స అనంతరం 35 మంది కోలుకుని డిశ్ఛార్జ్ కాగా, కరోనా మహమ్మారి బారిన పడి ఏపీలో ఇప్పటివరకూ 14 మంది మృతి చెందారు. ఆమె అందాలకు నెటిజన్లు LockDown
#CovidUpdates: రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 38 కేసు లు నమోదయ్యాయి.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 572 పాజిటివ్ కేసు లకు గాను 35 మంది డిశ్చార్జ్ కాగా, 14 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 523. #APFightsCorona pic.twitter.com/35rCkP5RQS— ArogyaAndhra (@ArogyaAndhra) April 17, 2020
#APFightsCorona గుంటూరు, కర్నూల్ జిల్లాల్లో అత్యధికంగా 126 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం 523 కరోనా యాక్టివ్ కేసులున్నాయని, వీరికి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. అక్కడబ్బాయి.. ఇక్కడమ్మాయి.. వాట్సాప్లో పెళ్లి!
ఏపీలో జిల్లాల వారీగా కరోనా వివరాలు:
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..