Amma vodi Scheme in AP: ఈనెలాఖరు లబ్ధిదారుల ఖాతాల్లోకి అమ్మ ఒడి పథకం మూడో దఫా సొమ్ము జమ కానుంది. ఈమేరకు ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో బటన్ నొక్కి సీఎం జగన్..తల్లుల ఖాతాల్లోకి సొమ్మును జమ చేస్తారు. ఐతే తాజా వార్త చాలా మంది లబ్ధిదారులకు షాక్‌ను కల్గిస్తోంది. అమ్మ ఒడి పథకం మూడో విడత సాయంలో 1.29 లక్షల మంది తల్లులకు ప్రభుత్వం కోత పెట్టనుందని తెలుస్తోంది.
అర్హుల జాబితాను ఈసారి కుదించింది. గతేడాది 44 లక్షల 48 వేల 865 మంది తల్లుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. ఈసారి ఆ సంఖ్య 43 లక్షల 19 వేల 90 మందికి తగ్గించారు. వీరిలో లక్షా 46 వేల 572 మంది తల్లులకు ఈ-కేవైసీ పూర్తి కాలేదు. విద్యుత్తు వాడకం నెలకు 300 యూనిట్లు దాటినా..విద్యార్థికి 75 శాతం హాజరు లేకపోయినా అమ్మ ఒడికి అనర్హులన్నీ ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది. కొంత మందికి కొత్త బియ్యం కార్డు రావడం..బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింకు లేకపోవడంతో వారికి ఈసారి ప్రయోజనం ఉండదని విద్యాశాఖ వెల్లడించింది.
కరోనా కారణంగా ఈసారి విద్యార్థుల హాజరు శాతం తగ్గింది. చాలా మందికి 75 శాతం హాజరు లేదు. దీంతో అమ్మ ఒడి పథకం సొమ్ము పడుతుందా లేదా అని చాలా మంది లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అర్హుల జాబితా గ్రామ, వార్డు సచివాలయాలకు చేరాయి. కానీ అనర్హుల జాబితా మాత్రం ఇంతవరకు రాలేదు. ఎందుకు అనర్హులయ్యారో లబ్ధిదారులకు తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులను చుట్టూ లబ్ధిదారులు తిరుగుతున్నారు. ఈఏడాది అమ్మ ఒడి పథకం అమలు బాధ్యతను పాఠశాల విద్యా శాఖ నుంచి గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగించారు.
ఈఏడాది అమ్మ ఒడి సాయంలో సుమారు రూ.2 వేల కోత పడనుంది. 2020లో మరుగుదొడ్ల నిర్వహణకు స్వచ్ఛందంగా రూ.వెయ్యి ఇవ్వాలని తల్లిదండ్రులను స్వయంగా సీఎం జగనే కోరారు. గతేడాది నుంచి తల్లుల ఖాతాలో జమ చేసే ముందే రూ.వెయ్యి మినహాయించి..మిగతా సొమ్ము వేశారు. ఈఏడాది మరుగుదొడ్లు, పాఠశాల నిర్వహణ కోసం రూ.2 వేలు మినహాయించనున్నారని తెలుస్తోంది. ఇదే విధానం ప్రైవేట్ స్కూళ్లకు సైతం వర్తించనుంది. అర్హత కోల్పోయిన వారి వివరాలను నవశకం లబ్ధిదారుల పోర్టల్‌లో నమోదు చేయాలని సచివాలయ సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశించారు.
పోర్టల్ నమోదులోనూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని లబ్ధిదారులు ఫైర్ అవుతున్నారు. పథకంపై ప్రశ్నిస్తేనే పోర్టల్ నమోదు చేస్తున్నారని చెబుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోందని అంటున్నారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం నిబంధనలను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.
Also read:Why Ginger is Beneficial: అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు.. ఈ 100 వ్యాధులు మటు మాయం..!
Also read:Corona Updates in India: భారత్‌లో కరోనా టెర్రర్..తాజాగా కేసులు ఎన్నంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook