Xi Jinping: చరిత్ర సృష్టించిన షీ జిన్‌పింగ్‌.. మూడోసారి దేశాధ్యక్షుడిగా ఎన్నిక..

Xi Jinping: చైనా అధ్యక్షుడిగా  షీ జిన్‌పింగ్‌ మూడోసారి దేశాధ్యక్ష పదవిని చేపట్టాడు. మరో ఐదేళ్ల పాటు జిన్‌పింగ్‌కు ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 10, 2023, 12:14 PM IST
Xi Jinping: చరిత్ర సృష్టించిన షీ జిన్‌పింగ్‌.. మూడోసారి దేశాధ్యక్షుడిగా ఎన్నిక..

Xi Jinping: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పదవీ కాలాన్ని మరో ఐదేళ్లుపాటు పొడిగించింది ఆ దేశ పార్లమెంటు. బీజింగ్‌లో జ‌రుగుతున్న 14వ నేష‌న‌ల్ పీపుల్స్ కాంగ్రెస్ పార్టీ స‌మావేశాల్లో ఆయ‌న్ను మూడోసారి దేశాధ్య‌క్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా సెంట్ర‌ల్ మిలిట‌రీ క‌మీష‌న్(CMC) చైర్మెన్‌గా కూడా మరోసారి నియమించబడ్డారు. ఆయనకు అనుకూలంగా 2,952 ఓట్లు పోలయ్యాయి.  

చైనా ఉపాధ్య‌క్షుడిగా హాన్ జంగ్ ఎన్నిక‌య్యారు. బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్‌(Great Hall of People)లో రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు షీ జిన్‌పింగ్‌. స్టాండింగ్ క‌మిటీ చైర్మెన్‌గా ఎన్నికైన జావో లెజితో పాటు ఉపాధ్య‌క్షుడు హాన్ జంగ్ కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. గత అక్టోబర్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (CPC)  ప్రధాన కార్యదర్శిగా 69 ఏళ్ల‌ జీ జిన్‌పింగ్ ఎన్నికైన సంగతి తెలిసిందే. దీంతో సీపీసీ వ్యవస్థాపకుడు మావో తర్వాత మూడోసారి పార్టీ పగ్గాలు అందుకున్న తొలి నేతగా జిన్‌పింగ్‌ అరుదైన ఘనతను అందుకున్నాడు.  

2012లో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా జిన్‌పింగ్‌ (Xi Jinping) తొలిసారి నియామకం చేపట్టారు. చైనా కమ్యూనిస్టు అధినాయకుడు మావో జెడాంగ్‌ తరవాత అంతటి శక్తిమంతమైన నేతగా జిన్‌పింగ్‌ ఆవిర్భవించారు. 

Also Read: Nepal New President: నేపాల్ నూతన అధ్యక్షుడిగా రామచంద్ర పాడెల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News