Corona cases worldwide: ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి సునామిలా విరుచుకుపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య శుక్రవారం నాటికి 32 కోట్లు దాటింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కలిపి 320,988,827 కరోనా కేసులు నమోదయ్యాయి.
మొత్తం కేసుల్లో ఇప్పటి వరకు 264,126,267 మంది కరోనాను జయించారు. 5,539,421 మంది కొవిడ్‌కు (Worldwide Corona deaths) బలయ్యారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 51,323,139 మంది కొవిడ్‌తో (Worldwide Corona Active cases) పోరాడుతున్నారు. అయితే ఇందులో 96,671 మందిపై మాత్రమే కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది.
దేశాల వారీగా కరోనా కేసులు ఇలా..
అమెరికాలో అత్యధికంగా మొత్తం 65,236,475 మందికి కరోనా (Corona cases in USA) సోకింది. ఒక్క రోజులోనే తాజాగా 806,493 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 42,911,490 మంది కోలుకున్నారు. 869,212 మంది మహమ్మారికి బలయ్యారు. అమెరికాలో ఇంకా 21,455,773 యాక్టివ్ కరోనా కేసులు (Corona Active cases in USA) ఉన్నాయి.
రెండో స్థానంలో భారత్ ఉంది. ఇండియాలో ఇప్పటి వరకు మొత్తం 36,582,129 కొవిడ్ (Corona Cases in India) కేసులు నమోదవగా.. అందులో 34,824,706 మంది కోలుకున్నారు. 485,350 మంది కొవిడ్‌తో మరణించారు. దేశంలో 1,272,073 యాక్టివ్ కరోనా కేసులు (Corona Active cases in India) ఉన్నాయి.
బ్రెజిల్లో తాజాగా 97,221 కరోనా కేసులు (Corona Cases in Brazil) బయటపడ్డాయి. ఇప్పటి వరకు ఈ దేశంలో మొత్తం 22,815,827 మందికి కరోనా సోకింది. 620,609 మంది ప్రాణాలు కోల్పోగా.. 21,650,151 మహమ్మారిని జయించారు. బ్రెజిల్లో ఇంకా 545,067 యాక్టివ్ కేసులు (Corona Active cases in Brazil) ఉన్నాయి.
యూకేలోనూ కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 14,967,817 మందికి పాజిటివ్‌గా (Corona Cases in UK) తేలింది. తాజాగా ఒక్క రోజులోనే 109,133 కేసులు నమోదవడం గమనార్హం. యూకేలు ఇంకా 3,689,522 యాక్టివ్ కేసులు (Corona active cases in UK) ఉన్నాయి.
ఫ్రాన్స్‌లో తాజాగా 305,322 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 13,240,304కు (Corona cases in France) పెరిగింది. ఇందులో 126,530 మంది మరణించారు. 8,857,455 మంది కోలుకున్నారు. ఫ్రాన్స్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 4,256,319 వద్ద (Corona Active cases in France) ఉంది.
రష్యాలో మొత్తం కరోనా కేసులు కోటీ 7 లక్షలు (Corona Cases in Russia) దాటాయి. ఇందులో ఇపత్పటి వరకు 9,784,348 మంది కొవిడ్‌ను జయించగా.. 319,172 మంది ప్రాణాలు కోల్పోయారు. 619,785 యాక్టివ్ కేసులు (Corona Acive cases in Russia) ఉన్నాయి.
Also read: Afghan Crisis: ఆఫ్గన్‌లో అత్యంత దయనీయ పరిస్థితులు.. కిడ్నీలు అమ్ముకుంటున్న పేదలు
Also read: China Omicron: చైనాలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. నిజం బయటపెట్టిన వోక్స్ వ్యాగన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook