కోవిడ్-19 ( Covid -19 ) వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఒక వైపు ప్రపంచం మళ్లీ గాడిలో పడటానికి ప్రయత్నిస్తోంటే మరోవైపు కరోనావైరస్ ( Coronavirus ) కొరలు చాస్తోంది. గడచిన 24 గంటల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 2,76,398 మందికి కోవిడ్-19 సోకిందట. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్యం సంస్థ ( WHO ) ప్రకటన చేసింది. కరోనావైరస్ సంక్రమణ పెరగడంతో పాటు మరణాల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో 6,933 మంది మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 20,439,814 మందికి కరోనావైరస్ సోకింది. ఇప్పటి వరకు కోవిడ్-19 వల్ల 7,44,385 మంది ఊపిరి వదిలారట.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తాగాజా వెల్లడించిన గణాంకాల ప్రకారం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 64,15,476 మంది కరోనాతో పోరాడుతున్నారు. అదే సమయంలో కోవిడ్-19 మహమ్మారితో పోరాడి గెలిచిన వారి సంఖ్య 1,39,11,414 గా ఉంది. WHO : రష్యా వ్యాక్సిన్ పనితీరుపై సందేహాలు
కరోనావైరస్ కేసుల విషయంలో అమెరికా (Covid-19 In USA ) అగ్రస్థానంలో ఉంది అని.. అక్కడ మొత్తం 54,15,666 మందికి వైరస్ సోకింది. రెండో స్థానంలో ఉన్న బ్రెజీల్ లో (Covid-19 Brazil ) 32,29,621 మంది వైరస్ బారిన పడ్డారు. భారత్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు భారత్ లో ( Covid-19 India ) మొత్తం 24,59,613 కేసులు నమోదు అయ్యాయి. Pranab Mukherjee: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చికిత్సకు స్పందిస్తున్నారు