Coronavirus: ఆ మహిళ మరణానికి కారణం కరోనా వైరస్

కరోనా వైరస్ కారణంగా మొన్నటివరకూ ఎక్కడికక్కడ ప్రయాణాలు నిలిచిపోయాయి. అంతర్జాతీయ ప్రయాణాలు ఇప్పటికే పూర్తిగా పునరుద్ధిరించుకోలేదు. ఈ నేపధ్యంలో విమానంలో ఆ మహిళ మరణానికి కారణం తెలిసి ఆందోళన నెలకొంది.

Last Updated : Oct 22, 2020, 02:27 PM IST
Coronavirus: ఆ మహిళ మరణానికి కారణం కరోనా వైరస్

కరోనా వైరస్ ( Corona virus ) కారణంగా మొన్నటివరకూ ఎక్కడికక్కడ ప్రయాణాలు నిలిచిపోయాయి. అంతర్జాతీయ ప్రయాణాలు ఇప్పటికే పూర్తిగా పునరుద్ధిరించుకోలేదు. ఈ నేపధ్యంలో విమానంలో ఆ మహిళ మరణానికి కారణం తెలిసి ఆందోళన నెలకొంది.

కరోనా వైరస్ కారణంగా నిన్న మొన్నటి వరకూ ప్రయాణాలు నిలిచిపోయాయి. మధ్యలో అత్యవసరాల నిమిత్తం అంతర్జాతీయ విమానసేవలు ( International Flights ) నడిచినా తరువాత మళ్లీ నిలిచిపోయాయి. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాల్లోనూ అంతర్జాతీయ విమాన సేవలు పూర్తిగా పునరుద్ధరించుకోలేదు. ఇప్పటికీ ప్రయాణీకుల భద్రత, వైరస్ సంక్రమణ ప్రమాదం నేపధ్యంలో ఈ పరిస్థితి నెలకొంది. 

ఈ క్రమంలో ఆ విమానంలో మహిళ మరణానికి కారణం తెలిసి సర్వత్రా ఆందోళన నెలకొంది. ప్రయాణీకుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జూలై నెలాఖర్లో లాస్ వెగాస్ నుంచి డల్లాస్ ( Las Vegas to Dallas ) వెళ్లే  స్పిరిట్ ఎయిర్‌లైన్స్  ( Spirit Airlines ) విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు...దారిలో అంటే విమానంలో టెక్సాస్‌ ( Texas ) కు చెందిన మహిళ మరణించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో ఆమె మరణానికి కారణమేంటనేది బయటకు రాలేదు. ఇప్పుడు తాజాగా ఆ మహిళ మరణానికి కారణం  కోవిడ్ 19 అని అధికారులు ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. 

స్పిరిట్ ఎయిర్ లైన్స్  ఫ్లైట్ జూలై 24 సాయంత్రం లాస్ వెగాస్ నుంచి డల్లాస్ - ఫోర్ట్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయానికి  ( Fort worth international airport ) బయలుదేరింది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమె ఎంత సేపటికి స్పందించకపోవడంతో ఆ విమానాన్ని అల్బుకెర్కీ వద్ద నిలిపేశారు. అయితే అప్పటికే ఆ మహిళ చనిపోయిందని ఆల్బుకెర్కీ ఇంటర్నేషనల్ సన్‌పోర్ట్ ప్రతినిధి తెలిపారు. ఈ  ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు  టెక్సాస్‌కు చెందిన 38 ఏళ్ల  మహిళ విమానంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిందని..తరువాత శ్వాస ఆగిపోయిందని ప్రకటించారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ సభ్యుడు ఆమెకు సీపీఆర్‌ చేయడానికి ప్రయత్నించినా లాభం లేకపోయిందని పోలీసులు వెల్లడించారు. అయితే ఆమె మరణ రిపోర్టులు వచ్చేంతవరకూ మహిళ మరణానికి కారణ కరోనా వైరస్ ( Women recognised died to covid ) అని విమానసిబ్బందికి తెలియదు. ఇప్పుడీ ఘటనతో విమానాల్లో ప్రయాణించేవారి భద్రతపై సందేహాలు వస్తున్నాయి.   

జూలైలో మరణిస్తే..రిపోర్టులు ఇంత ఆలస్యంగా ఎందుకొచ్చాయనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ సంఘటనపై స్పిరిట్ ఎయిర్ లైన్స్ సంస్థ మరణించిన మహిళ కుటుంబానికి సంతాపం ప్రకటించింది. వైరస్ కు సంబంధించిన అన్ని ప్రోటోకాల్స్ ను తమ సంస్థ అనుసరిస్తోందని..ఏ పొరపాటు జరగదని చెబుతోంది. ఆ రోజు ఆ మహిళతో కాంటాక్ట్ అయినవారిని ట్రేస్ చేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. Also read: China: నూడిల్స్‌‌ తిని కుటుంబంలో 9 మంది మృతి

Trending News