Israel Hamas War: హమాస్ ఉగ్రవాదులు నగ్నంగా ఊరేగించిన యువతి ఎవరు..? ఆమె బతికే ఉందా..?

Who Was German Woman Shani Louk: ఓ యువతిని కిడ్నాప్ చేసిన హమాస్ ఉగ్రవాదులు నగ్నంగా ఊరేగించిన విషయం తెలిసిందే. జర్మనీకి చెందిన ఆ యువతి ఇంకా బతికే ఉందని ఆమె తల్లి చెబుతున్నారు. ఆమె ఇజ్రాయెల్‌కు ఎందుకు వచ్చింది..? ప్రభుత్వం ఏం చెప్పింది..?  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 30, 2023, 08:10 PM IST
Israel Hamas War: హమాస్ ఉగ్రవాదులు నగ్నంగా ఊరేగించిన యువతి ఎవరు..? ఆమె బతికే ఉందా..?

Who Was German Woman Shani Louk: ఇజ్రాయెల్‌పై హమాస్ ఆకస్మిక దాడులు చేయగా.. స్థానికులను కిడ్నాప్ చేసి వారి పట్ల ఉగ్రవాదులు ప్రవర్తించిన తీరు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. జర్మన్ యువతి షానీ లౌక్‌ను కిడ్నాప్ చేసి.. దారుణంగా చిత్ర హింసలకు గురి చేసి నగ్నంగా ఊరేగించారు. ఇజ్రాయెల్‌లో హమాస్ దాడికి గురైన యువతి.. ట్రైబ్ ఆఫ్ సూపర్‌నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌లో పాల్గొంది. ఈ సమయంలోనే ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు దాడులు దిగారు. మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి యువతిని కిడ్నాప్ చేసి.. హమాస్ ఉగ్రవాదులచే చిత్రహింసలకు గురి చేశారు. గాజా చుట్టూ ఊరేగించి.. ఆమెకు నరకం చూపించారు. తన కుమార్తె మరణాన్ని ఆమె తల్లి ఇజ్రాయెల్ సైన్యం ద్వారా తెలుసుకున్నారు. యువతి వేసుకున్న టాటూ ద్వారా ఆమె గుర్తించారు. షానీ లౌక్‌ గురించి ఆవేదన చెందుతూ ఇజ్రాయెల్ ప్రభుత్వం ట్వీట్ చేసింది.

షానీ లౌక్ అదృశ్యమైనట్లు ఆమె మొదటి కజిన్ టోమాసినా వీన్‌ట్రాబ్-లౌక్ తెలిపింది. రిలాక్స్ అయ్యేందుకు ఆమె కోసం ఒక సంగీత ఉత్సవంలో పాల్గొందని.. ఇది తమ కుటుంబానికి ఒక పీడకల అని ఆవేదన వ్యక్తం చేసింది. షానీ లౌక్‌ను హమాస్ మిలిటెంట్లు బంధించి పికప్ ట్రక్కు వెనుక వీధుల్లో నడిపించిన దృశ్యాలు వైరల్ అయిన విషయం తెలిసిందే.

ఆమెను హమాస్ ఉగ్రవాదులు బంధీగా తీసుకోగా.. తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆమెను గాజాకు తీసుకెళ్లారు. అక్కడ ట్రక్కు వెనకాల ఊరేగిస్తూ.. ఆమెను కొట్టడం వీడియోలో కనిపించింది. షానీ క్రెడిట్ కార్డ్ గాజాలో ఉపయోగించినట్లు ఆమె కుటుంబ సభ్యులు బ్యాంక్ స్టేట్‌మెంట్ ద్వారా తెలుసుకున్నారు. ఆమె దగ్గర డబ్బులు కూడా దోచుకున్నారని వారు చెబుతున్నారు. అయితే ఇజ్రాయెల్‌పై దాడి తర్వాత తన కుమార్తె ఇంకా బతికే ఉందని షానీ తల్లి తన నమ్మకంగా ఉన్నారు. గాజా స్ట్రిప్‌లోని కుటుంబ స్నేహితుడి నుంచి హమాస్ ఆసుపత్రిలో తన కుమార్తె ఇంకా బతికే ఉందని తాను తెలుసుకున్నానని ఆమె అంటున్నారు.

“షానీ బతికే ఉంది.. కానీ తలకు బలమైన గాయం తగిలింది.  పరిస్థితి విషమంగా ఉందని మా వద్ద సమాచారం ఉంది. ఇక నుంచి ప్రతి నిమిషం కీలకం. మా కూతురిని రక్షించాలి. త్వరగా చర్య తీసుకోవాలని మేము జర్మన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా..” షానీ తల్లి ఓ వీడియోను రిలీజ్ చేశారు. కాగా.. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులతో 1,400 మంది మరణించారు. 230 మంది కిడ్నాప్‌నకు గురయ్యారు. గాజాపై ఇజ్రాయెల్ దాడితో ఇప్పటివరకు సుమారు 8 వేల మంది మరణించారు.

Also Read: Nara Lokesh: కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి.. సీఎం జగన్ మోహన్ రెడ్డికి నారా లోకేష్‌ బహిరంగ లేఖ   

Also Read: Vizianagaram Train Accident: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలును ఢీకొట్టిన రాయగడ ఎక్స్‌ప్రెస్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News