H1B Visa: హెచ్ 1బి వీసా అనేది అగ్రరాజ్యంలో ఉద్యోగం చేసేవారికి ఆ దేశం ఇస్తుంది. హెచ్1బి వీసా ఫైలింగ్ కోసం యూఎస్ ఇప్పుడు కొత్త ఫారమ్ విడుదల చేసింది. 2025 జనవరి 17 నుంచి కొత్త ఫారమ్ అమల్లోరి రానుంది. ఫారమ్ 1-29 కొన్ని మార్పులతో విడుదలయింది.
అమెరికాలో ఉద్యోగం కోసం ప్రధానంగా కావల్సింది హెచ్1బీ వీసా. దీనికోసం దరఖాస్తు చేయాల్సిన ఫారమ్ 1-29లో మార్పులు చేసింది అమెరికా. హెచ్ 1బి, హెచ్ 2 అప్‌డేటెడ్ నియమాలు చేర్చింది. వచ్చే ఏడాది అంటే జనవరి 17 నుంచి కొత్త ఫారమ్ అమల్లోకి రానుంది. ఆ తేదీ నుంచి పాత ఫారమ్ సమర్పిస్తే తిరస్కరిస్తారు. వలసేతర కార్మికుల కోసం ఇది వర్తిస్తుంది. ఇందులో ప్రధానంగా హెచ్ 1బి, హెచ్ 2ఏ, హెచ్2బి, హెచ్ 3 విభాగంలో తాత్కాలిక, ట్రైన్డ్ ఉద్యోగులు, ఎల్ 1 ఇంట్రా కంపెనీ ట్రాన్స్‌ఫర్లు , ఓ1, ఓ2 శక్తి సామర్ధ్యాలు కలిగినవారుంటారు. వీరితో పాటు పీ కేటగరీలో కళాకారులు, క్రీడాకారులు, వినోదకారులుంటారు.
హెచ్1 బీ వీసా ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ పిటీషనర్లు తప్పనిసరిగా తమ పేర్లు నమోదు చేసుకోవాలి. ప్రతి లబ్దిదారుడు నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ వ్యవధి 14 రోజులుంటుంది.
Also read: US Visa Updates: భారతీయ విద్యార్ధులకు గుడ్‌న్యూస్, లక్ష నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలు మంజూరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.