H1B Visa: భారతీయులకు ఊరట..ట్రంప్ ఆంక్షల్ని కొట్టిపారేసిన కోర్టు

H1B Visa: హెచ్1బీ వీసాల విషయంలో ఐటీ నిపుణులకు భారీ ఊరట లభించింది. ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంక్షలపై అమెరికా ఫెడరల్ కోర్టు కొట్టి పారేసింది. విధానం పారదర్శకంగా లేదని స్పష్టం చేసింది.

Last Updated : Dec 2, 2020, 04:36 PM IST
  • హెచ్1బీ వీసా ఆంక్షల్ని కొట్టిపారేసిన అమెరికా ఫెడరల్ కోర్టు
  • ట్రంప్ ప్రభుత్వం విధించిన ఆంక్షలు పారదర్శకంగా లేవని భావించిన కోర్టు
  • భారతీయ ఐటీ నిపుణులకు భారీ ఊరట
H1B Visa: భారతీయులకు ఊరట..ట్రంప్ ఆంక్షల్ని కొట్టిపారేసిన కోర్టు

H1B Visa:హెచ్1బీ వీసాల విషయంలో ఐటీ నిపుణులకు భారీ ఊరట లభించింది. ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంక్షలపై అమెరికా ఫెడరల్ కోర్టు కొట్టి పారేసింది. విధానం పారదర్శకంగా లేదని స్పష్టం చేసింది.

భారతీయ ఐటీ నిపుణులకు ( It Experts ) భారీ ఊరట లభించే వార్త వెలువడింది. ట్రంప్ ప్రభుత్వం ( Trump Government ) ప్రవేశపెట్టిన హెచ్1బీ వీసా ఆంక్షల్ని అమెరికా ఫెడరల్ కోర్టు ( Federal court ) కొట్టి పారేసింది. హెచ్1బీ వీసా ఆంక్షల్ని కఠినతరం చేస్తూ ట్రంప్ చేసిన మార్పులను యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి జెఫ్రీ వైట్ తోసిపుచ్చారు. ఈ విషయంలో ట్రంప్ ప్రభుత్వం పారదర్శక విధానాన్ని పాటించలేదని..కరోనా మహమ్మారి కారణంగా తలెత్తిన ఉద్యోగ నష్టాల్ని పుచ్చుకోవడానికి వాదించడం సరైంది కాదని కోర్టు అభిప్రాయపడింది. వాస్తవానికి అక్టోబర్ నెలలో ట్రంప్ ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసిందని కోర్టు తెలిపింది.

ఈ తీర్పు ద్వారా బే ఏరియా కౌన్సిల్, స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ, ఇతర విద్యావ్యాపార వర్గాలు విజయం సాధించినట్టైంది. ఆర్థిక వ్యవస్థకు లభించిన విజయమని..చెత్త ఆదేశాలపై సాధించిన గెలుపని బే ఏరియా కౌన్సిల్ తెలిపింది. త్వరలో జో బిడెన్ ( Joe Biden ) అమెరికా అధ్యక్ష పదవి స్వీకరించనున్న నేపథ్యంలో తాజా ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. Also read: Pfizer comments: వ్యాక్సిన్ కంపెనీ నుంచే వ్యాక్సిన్ అవసరం లేదన్న వ్యాఖ్యలు..ఎందుకు

అమెరికా ( America ) దేశంలో విదేశీ నిపుణుల రాకను అడ్డుకోవడం ద్వారా స్థానికులకు ఉపాధి పెంచేందుకు ట్రంప్ ప్రభుత్వం వీసాలపై ఆంక్షలు విధించింది. హెచ్1బీ వీసాలపై ధర్డ్ పార్టీ సంస్థల్లో హెచ్1బీ ( H1B Visa ) ఉద్యోగాల నియామకాలపై ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని బే ఏరియా కౌన్సిల్, యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వంటి సంస్థలు సవాలు చేశాయి. ప్రతి యేటా టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి రంగాల్లో దాదాపు 85 వేల వీసాల్ని ఇస్తోంది. ఈ వీసాలకు మూడేళ్ల గడువుంటుంది. తరువాత వీటిని రెన్యువల్ చేసుకోవల్సి వస్తుంది. అమెరికాలో హెచ్1బీ వీసాల్ని పొందినవారిలో 6 లక్షలమంది భారత్, చైనాకు చెందినవారే ఉన్నారు. 

అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బిడెన్ బాథ్యతలు స్వీకరించిన తరువాత..ట్రంప్ ఆంక్షల్ని రద్దు చేేసే అవకాాశాలున్నాయని భావిస్తున్నారు. అదే జరిగితే లక్షలాది మంది భారతీయుల వీసా ఇబ్బందులు తొలగనున్నాయి. Also read: Corona Vaccine By UK: ప్రపంచంలోని తొలి కరోనా వ్యాక్సిన్.. ఆమోదించిన యూకే ప్రభుత్వం

Trending News