US COVID-19 Death Toll Crosses 5 Lakh: కరోనా వైరస్ మహమ్మారి కట్టడిలో అగ్రరాజ్యం అమెరికా దారుణంగా విఫలమైంది. ప్రపంచంలో అన్ని రంగాలలో తనదైన రీతిలో ముందంజలో దూసుకెళ్తున్న అమెరికా మాత్రం కరోనాను అడ్డుకోలేకపోయింది. అమెరికాలో కరోనా మరణాలు 5 లక్షలు దాటిపోవడం ఆందోళనను రేకెత్తిస్తోంది.
ఆదివారం నాటికి అమెరికాలో కోవిడ్-19(COVID-19) బారిన పడి 4.98 లక్షల మంది చనిపోయారు. తాజాగా సంభవించిన మరణాలతో అమెరికాలో కరోనా బలి తీసుకున్న వారి సంఖ్య 5,11,130కి చేరిందని పలు అమెరికా మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే అగ్రరాజ్యంలో భారీ సంఖ్యలో మరణాలు సంభవించాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.
Also Read: Effect Of COVID-19 Vaccine: కరోనా టీకాల ప్రభావం.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే
దాదాపు 102 ఏళ్ల కిందట ఇన్‌ఫ్లూయెంజా మహమ్మారి చేసిన విలయం అనంతరం అమెరికా అతిపెద్ద ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఇదేనని సైతం అమెరికా అంటువ్యాధుల విభాగం నిపుణులు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు. కరోనాను కట్టడి చేస్తామని జో బైడెన్(Joe Biden) ప్రభుత్వం చెప్పినా ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. మరోవైపు మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి.
Also Read: EPFO: ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి కొత్త PF Tax Rules, దీని ప్రభావం ఇలా ఉండనుంది
తాజాగా మంచు తుఫానులు అమెరికా వాసులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. తీవ్రమైన చలి కారణంగా వైరస్ వ్యాప్తి అతివేగంగా కొనసాగుతుందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ అధ్యక్ష బాధ్యతల నుంచి దిగిపోయే నాటికి 4 లక్షలకు పైగా మరణాలు ఉండగా, తాజాగా వీటి సంఖ్య 5 లక్షల మార్క్ చేరుకుంది.
Also Read: COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకునే మద్యం ప్రియులకు చేదువార్త..
అమెరికాలో ఫిబ్రవరి 2020లో తొలి కరోనా మరణం సంభవించింది. ఇప్పటివరకూ అగ్రరాజ్యంలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య దాదాపు 3 కోట్లకు చేరువైంది. ప్రపంచ వ్యాప్తంగా 2.5 మిలియన్లకు పైగా కోవిడ్-19 బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాంతక వైరస్ బారి నుంచి కోలుకున్నా లక్షలాది మంది ఇతరత్రా అనారోగ్య సమస్యలతో చనిపోతున్నారు. జో బైడెన్ ప్రభుత్వం కరోనాపై పోరాటంలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook