Covid First Pill: కోవిడ్ నివారణకు ట్యాబ్లెట్ వచ్చింది

Covid updates UK becomes first country to approve Mercks anti Covid pill molnupiravir :కరోనా మహమ్మారిపై పోరాటానికి మెర్క్,(Merck) రిడ్జ్‌బ్యాక్ బయోథెరప్యూటిక్స్‌ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన యాంటీవైరల్ ట్యాబ్లెట్‌ను బ్రిటన్ ఆమోదించింది. ఈ తరహా చికిత్సకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన మొదటి దేశంగా బ్రిటన్ నిలిచింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 4, 2021, 07:44 PM IST
  • కొవిడ్‌ చికిత్స విధానంలో కొత్త మార్పులు
  • యాంటీవైరల్ ట్యాబ్లెట్‌కు బ్రిటన్ ఆమోదం
  • ఇలాంటి చికిత్సకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన మొదటి దేశంగా రికార్డు సృష్టించిన బ్రిటన్
Covid First Pill: కోవిడ్ నివారణకు ట్యాబ్లెట్ వచ్చింది

UK becomes the first country to approve antiviral COVID-19 pill: కొవిడ్‌ చికిత్స విధానంలో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కరోనా మహమ్మారిపై పోరాటానికి మెర్క్,(Merck) రిడ్జ్‌బ్యాక్ బయోథెరప్యూటిక్స్‌ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన యాంటీవైరల్ ట్యాబ్లెట్‌ను బ్రిటన్ ఆమోదించింది. ఈ తరహా చికిత్సకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన మొదటి దేశంగా బ్రిటన్ నిలిచింది. 

కొవిడ్‌ చికిత్సకు ఆమోదం పొందిన మొదటి ఓరల్‌ యాంటీవైరల్ చికిత్స ఇదే. కరోనా పాజిటివ్‌గా తేలితే.. వీలైనంత త్వరగా లేదా లక్షణాలు కనిపించిన అయిదు రోజుల్లోపు మోల్నుపిరవిర్ ట్యాబ్లెట్స్‌ను వాడాలని బ్రిటన్ మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (Medicines and Healthcare products Regulatory Agency) (MHRA) సిఫార్సు చేసింది. బ్రిటన్‌లో (Britain‌) మోల్నుపిరవిర్‌ను (molnupiravir) ‘లగేవ్రియో’ (Lagevrio) అనే బ్రాండ్‌తో రూపొందించారు.

Also Read : Samantha Shocking Decision: విడాకుల తరువాత సమంత మరో షాకింగ్ నిర్ణయం..??

అయితే కొవిడ్‌ చికిత్సలో మోల్నుపిరవిర్‌ను వినియోగించాలా వద్దా అనే అంశంపై అమెరికా మెడిసిన్‌ రెగ్యులేటరీ నిపుణులు ఈ నెలలో సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లో (Britain‌) ఆమోదం లభించడం కీలకంగా మారింది. ఇక కోవిడ్ (Covid) వైరస్‌ ప్రారంభ దశలో ఉన్నప్పుడే ఈ చికిత్స ప్రారంభిస్తే.. రోగి ఆసుపత్రి పాలవ్వడం, మరణించే అవకాశాలు తగ్గుతాయనే విషయం ట్రయల్స్‌లో తేలింది.

Also Read : Akhanda Title Song Teaser: అదిరిపోయిన బాలకృష్ణ అఖండ టైటిల్ సాంగ్ టీజర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News