Donald Trump’s company plans to sell the luxury hotel: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యాపార పరంగానూ కలిసి రావడం లేదు. భారీ నష్టాల కారణంగా ట్రంప్ రియల్టీ వ్యాపారంలో (Trump Organization) భాగమైన ఓ లగ్జరీ హోటల్‌ను విక్రయించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.
డీల్ వివరాలు..
వాషిగ్టన్ డీసీలో ట్రంప్ ఇంటర్నేషనల్ పేరుతో 263 గదులు ఉన్న ఓ భారీ హోటల్‌ను (Trump Hotel to Sell) విక్రయించేందుకు కసరత్తు జరగుతున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ ఇటీవల ఓ కథనంలో పేర్కొంది. దీని ప్రకారం.. ట్రంప్ గ్రూప్ మియామి కేంద్రంగా పని చేస్తున్న సీజీఐ మర్చంట్ గ్రూప్‌తో ఈ డీల్‌పై చర్చరిస్తున్నట్లు పేర్కొంది. ఈ డీల్ విలువ 375 మిలియన్ డాలర్లు (Trump Hotel deal) ఉంటుందని అంచనా వేసింది.
ఈ డీల్ పూర్తయితే హోటల్ పేరును వాలడ్రోఫ్ ఆస్టోరిగా మార్చనున్నారని సమాచారం. ఈ హోటల్‌ను హిల్టన్ గ్రూప్ నిర్వహించనుందని తెలిసింది.
Also read: Afghan Food crisis: ఆఫ్గాన్‌ను భయపెడుతున్న మరో సంక్షోభం.. లక్షలాది మంది పిల్లల్లో పోషకాహార లోపం!
ట్రంప్ మద్దతుదారులకు కేరాఫ్ అడ్రస్..
ట్రంప్ మద్దతుదారులలైన రిపబ్లికన్లకు, విదేశీ వ్యాపారులకు ఈ హోటల్ కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది. ట్రంప్ ఆర్గనైజేషన్ ఈ హోటల్ భవనాన్ని లీజుకు తీసుకుంది. 2016లో ఈ హోటల్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 2019లోనే ఈ లీజును విక్రయించేందుకు ప్రయత్నించినా ఆశించిన స్థాయిలో డీల్ దక్కలేదు.
ఆ తర్వాత కరోనా సంక్షోభం ప్రారంభమవడంతో హోటల్ భారీ నష్టాలను నమోదు చేసింది. ఓ అంచనా ప్రకారం.. 70 మిలియన్ డాలర్ల నష్టాన్ని ఈ హోటల్ మూటగట్టుకున్నట్లు తెలిసింది. అయితే ట్రంప్ ఆర్గనైజేషన్ మాత్రం 150 మిలియన్ డాలర్ల లాభాన్ని ప్రకటించడం గమనార్హం.
ఈ కారణంగా లీజును మరో సంస్థకు విక్రయించి భారీ నష్టాలను కొంతైనా తగ్గించుకోవాలని ట్రంప్ గ్రూప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ డీల్‌పై ఇటు ట్రంప్ ఆర్గనైజేషన్స్ గానీ.. అటు కొనుగోలు సంస్థగానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Also read: Oxygen on Moon: చంద్రుడిపై 800 కోట్ల మందికి లక్ష ఏళ్లకు సరిపడా ఆక్సిజన్..!
Also read: Singapore Minor : 15 ఏళ్ల అమ్మాయితో 57 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి, 10 నెలల జైలు శిక్ష
మీడియా వ్యాపారం ట్రంప్..
ట్రంప్ గ్రూప్ హోటళ్ల వ్యాపారంలో నష్టపోయినా.. కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషిస్తూ వస్తోంది. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్(టీఎంటీజీ) పేరుతో తాను కొత్త సంస్థను ప్రారంభిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ గత నెలలో ప్రకటించారు. 'ట్రూత్ సోషల్' పేరుతో మెసేజింగ్ యాప్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కంపెనీ ట్విట్టర్, ఫేస్బుక్ సంస్థలకు పోటీ ఇవ్వనుందని కూడా చెప్పారు.
ఈ సంస్థను మరో మీడియా సంస్థతో విలీనం ద్వారా ట్రంప్ గ్రూప్‌నకు కాసుల వర్షం కురిసే అవకాశాలున్నాయి.
Also read: Snow leopards Corona: కరోనాతో మంచు చిరుతలు మృతి...ఎక్కడంటే...
Also read: Ecuador Prison Riots: జైలులో ఖైదీల మద్య ఘర్షణ.. 68 మంది మృతి, 25 మందికి తీవ్ర గాయాలు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook