Sri Lanka economic crisis: శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం.. మరో 500 మి.డాలర్ల సాయం!

Sri Lanka economic crisis: భారత్ మరోసారి తన గొప్ప మనసును చాటుకుంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ద్వీపదేశం శ్రీలంకకు ఆపన్నహస్తం అందింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 23, 2022, 07:13 PM IST
Sri Lanka economic crisis: శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం.. మరో 500 మి.డాలర్ల సాయం!

Sri Lanka economic crisis: ద్వీపదేశం శ్రీలంకకు (Sri Lanka) భారత్ తన సాయాన్ని కొనసాగిస్తోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న లంకకు మరోసారి మరోసారి ఆపన్న హస్తం అందించింది ఇండియా (India). తాజాగా ఇంధన దిగుమతుల కోసం మరో 500 మిలియన్‌ డాలర్ల క్రెడిట్‌ లైన్ (Credit line) అందించేందుకు రెడీ అయింది. ఈ విషయాన్ని ఆ దేశ ఆర్థిక మంత్రి అలీ సబ్రీ (ali sabry) స్వయంగా వెల్లడించారు. విదేశీ మారక నిల్వలు తగినంత లేకపోవడంతో... నిత్యావసరాల దిగుమతుల్లో శ్రీలంక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ద్వీపదేశంలో ద్రవ్యోల్బణం కొండెక్కి కూర్చుంది. 

ప్రస్తుతం ఉన్న పరిస్థితి నుంచి లంకను  గట్టెక్కెంచేందుకు భారత్ కృషి చేస్తోంది. ఇప్పటికే ఆ దేశానికి పలుసార్లు క్రెడిట్ లైన్ రూపంలో పెద్ద మెుత్తంలో రుణాన్ని మంజూరు చేసింది. అంతేకాకుండా,  1.5 బిలియన్‌ డాలర్ల దిగుమతుల డబ్బు చెల్లింపు తేదీని వాయిదా చేసింది. వీటిలో పాటుగా 400 మిలియన్‌ డాలర్ల ద్రవ్య బదిలీ సమయాన్ని కూడా పొడిగించి.. తన గొప్ప మనసు చాటుకుంది భారత్. బెయిల్ ఔట్‌ ప్యాకేజీ గురించి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థతో (IMF) చర్చలు జరుపుతుంది లంక ప్రభుత్వం. మరోవైపు ఆర్థిక సాయం నిమిత్తం.. ప్రపంచ బ్యాంకుతో సహా చైనా, జపాన్ వంటి దేశాలతో చర్చలు జరుపుతుంది.

Also Read: Indonesia Oil Ban: ఇండోనేషియా పామ్ ఆయిల్‌పై నిషేధం..మరోసారి పెరగనున్న పామ్ ఆయిల్‌ ధరలు..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News