Umrah Bus Accident: ఉమ్రా యాత్రలో ఘోర రోడ్డు ప్రమాదం, 20 మంది మరణం

Umrah Bus Accident: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉమ్రా కోసం మక్కా వెళ్తున్న బస్సు బోల్తాపడి మంటలు అంటుకున్నాయి. 20 మంది మరణించగా, 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 28, 2023, 08:47 AM IST
Umrah Bus Accident: ఉమ్రా యాత్రలో ఘోర రోడ్డు ప్రమాదం, 20 మంది మరణం

Umrah Bus Accident: పవిత్ర రంజాన్ నెలలో దైవ సన్నిధికి వెళ్లిన యాత్రికులు మృత్యువాత పడ్డారు. ఉమ్రా యాత్ర కోసం మక్కాకు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బ్రేకులు విఫలమై బోల్తాపడిన బస్సులోంచి మంటలు చెలరేగడంతో పెద్దఎత్తున ప్రాణనష్టం వాటిల్లింది.

సౌదీ అరేబియాలోని యాసిర్ ప్రావిన్స్, అభా నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉమ్రా కోసం మక్కాకు వెళ్తున్న భక్తుల బస్సు బ్రేకులు విఫలం కావడంతో బ్రిడ్జి పైనుంచి కిందకు బోల్తాపడింది. ఈ ఘటనతో బస్సులో మంటలు అంటుకున్నాయి. బస్సులో 20 మంది మరణించగా, 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం గురించి తెలియగానే సౌదీ సివిల్ డిఫెన్స్, రెడ్ క్రీసెంట్ అథారిటీ బృందాలు చేరుకున్నాయి. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. బస్సులో మంటలు అంటుకోవడం వల్లనే ప్రమాద తీవ్రత పెరిగిందని తెలుస్తోంది. 

దుర్ఘటనలో గాయపడిన లేదా మరణించిన యాత్రికులు ఏ దేశానికి చెందినవారనే వివరాలు ఇంకా తెలియలేదు. అల్ అఖ్ బారియా న్యూ స్ ఛానెల్ అందించిన వివరాల ప్రకారం వివిధ దేశస్థులున్నారని తెలుస్తోంది. రంజాన్ పవిత్ర మాసం కావడంతో హజ్ యాత్రికుల సంఖ్య భారీగా పెరిగింది. మక్కా, మదీనా రెండు పవిత్ర నగరాల మధ్య యాత్రికుల పర్యటన కొనసాగుతోంది.

2019 అక్టోబర్ నెలలో ఇలాగే యాత్రికులతో కూడిన బస్సు మదీనా సమీపంలో మరో భారీ వాహనాన్ని ఢీ కొట్టడంతో 35 మంది మరణించారు. 4 గురికి గాయాలయ్యాయి. 

Also read: US Tornado: అమెరికాలో టోర్నడో బీభత్సం.. 25 మంది మృతి, పలువురు గల్లంతు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News