Russia vs Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా మిలటరీ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇరుదేశాలు నువ్వానేనా అన్నట్లు యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ యుద్ధంతో ఉక్రెయిన్‌లోని కీలక నగరాలు తుడ్చుకుపెట్టుకుపోయాయి. దీని వల్ల ఇరు దేశాలకు ఏమి ఒరిగిందో తెలియదు గానీ..ప్రపంచ దేశాలకు ఆ యుద్ధం శాపంగా మారుతోంది. రష్యా సైనిక చర్యతో ప్రపంచవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వంట నూనెలు సలసల కాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు మండుతున్నాయి. కొన్ని దేశాల్లో ఎరువుల కొరత తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. దీంతో ఆయా దేశాలు తమ విధానాలను మార్చుకుంటున్నాయి.
ఉక్రెయిన్, రష్యా దేశాల నుంచి ప్రపంచదేశాలకు గోధుమలు, బార్లీ, మొక్కజొన్న, వంటనూనెలు అధిక శాతం ఎగుమతి అవుతున్నాయి. ఆఫ్రికా, యూరప్ దేశాలకు సైతం అక్కడి నుంచి వెళ్తాయి. ఐతే యుద్ధం వల్ల ఆయా దేశాల్లో ధరలు భగ్గుమంటున్నాయి. కొన్ని దేశాల్లో ఆహార సంక్షోభం తీవ్ర కలకలం రేపుతోంది. లెబనాన్‌లో సన్‌ఫ్లవర్ అయిల్ ధరలు 83 శాతం పెరిగాయి. గోధుమల ధరలు 47 శాతానికి చేరింది. దీంతో భారత్ నుంచి గోధుమలు తీసుకోవాలని ప్రపంచదేశాలు నిర్ణయించాయి. ఐతే దీని వల్ల కొరత ఏర్పడే అవకాశం ఉందని భావించిన మోదీ ప్రభుత్వం గోధుమల ఎగుమతులపై నిషేధం విధించింది.
రష్యా, ఉక్రెయిన్ సైనిక చర్య వల్ల ఇప్పటివరకు 58 లక్షల మంది వలసదారులు బయటకు వెళ్లారు. ఇటీవల కాలంలో ఇదే అతిపెద్ద శరణార్థుల సంక్షోభమని యూఎన్‌వో స్పష్టం చేసింది. 8.8 లక్షల మంది ఉక్రెయిన్ శరణార్థులను రొమేనియా అక్కున చేర్చుకుంది. వీరిలో అధిక మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. పోలండ్ దేశానికి దాదాపు 32 లక్షల మంది చేరుకున్నట్లు తెలుస్తోంది. వీటిని పరిగణలోకి తీసుకున్న కొన్ని దేశాలు తమ విదేశాంగ విధానాలను మార్చేందుకు సిద్ధమవుతున్నాయి. అమెరికా, ఐరోపా దేశాలతోపాటు ఇతర దేశాలు కొత్త విధానాలను అమలు చేయాలని నిర్ణయించాయి. ఇరాన్‌తో అణు ఒప్పందం చేసుకునే దిశగా అగ్ర రాజ్యాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
భారత్ మాత్రం ఆచితూచి ముందుకు వెళ్లాలని భావిస్తోంది. చైనా సైతం రష్యాన్ని బంధాన్ని కొనసాగించే అవకాశం ఉంది. ఇంధనం విషయంలో మరికొన్ని దేశాలు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాయి. దశల వారీగా రష్యా నుంచి చమురు, సహజ వాయువు దిగుమతులు తగ్గించుకుంటామని ఇదివరకే బ్రిటన్ తెలిపింది. రష్యాను నిలువరించేందుకు నాటో దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. భద్రతకు భారీ బడ్జెట్లు కేటాయించాయి. తమని నాటోలో చేర్చుకోవాలని ఫిన్లాండ్ అంటోంది. ఐతే దీనిని రష్యా ఖండిస్తోంది. ఇలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. కరోనా నుంచి ఇంకా కోలుకోని ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఈ యుద్ధం తీవ్ర అడ్డంకిగా మారిందని ఐఎంఎఫ్ నివేదికలు చెబుతున్నాయి.
Also read: IPL 2022: ఐపీఎల్ 2018ని బ్రేక్ చేసిన ఐపీఎల్ 2022.. 11 మ్యాచ్‌ల్లో 1000 దాటేనా?
Also read: Kcr Farm House: 18 రోజుల తర్వాత ప్రగతి భవన్ కు కేసీఆర్.. బీజేపీ, కాంగ్రెస్ కు దేత్తడేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook