Russia Ukraine War Updates: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ఎప్పుడు తెరపడుతుందనేది తెలియట్లేదు. యుద్ధం ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా... ఇరు దేశాల మధ్య చర్చల మీద చర్చలు జరుగుతున్నా యుద్ధానికి తెరపడే సూచనలు కనిపించట్లేదు. ఉక్రెయిన్‌పై రష్యా విధ్వంసం కొనసాగుతుండగా.. ఉక్రెయిన్ కూడా శక్తి మేర రష్యాపై ప్రతి దాడులు చేస్తోంది. తాజాగా ఉక్రెయిన్‌కు సరిహద్దులో ఉన్న రష్యా బ్రయాన్స్క్ నగరంలోని ఆయిల్ డిపోలో పేలుడు కారణంగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఆయిల్ పైప్‌లైన్‌పై ఉక్రెయిన్ దాడి వల్లే ఈ మంటలు చెలరేగాయా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఆయిల్ డిపో పేలుడుకి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నెల 22న ఉక్రెయిన్‌లోని చుగివ్ ఖార్కివ్ రీజియన్‌లో ఉన్న ఆయిల్ డిపోపై రష్యా వైమానిక దాడులు జరిపి ధ్వంసం చేసింది. అందుకు ప్రతీకారంగా ఉక్రెయిన్ రష్యా ఆయిల్ డిపోపై దాడికి పాల్పడిందా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. స్థానికులను అక్కడి నుంచి తరలించే చర్యలేవీ చేపట్టలేదని తెలిపింది.
బ్రయాన్స్క్‌లోని ఈ ఆయిల్ డిపో నుంచి పైప్ లైన్ ద్వారా యూరోప్ దేశాలకు ఆయిల్ సప్లై చేస్తారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆయిల్ పైప్‌లైన్స్‌లో ఇదొకటి. 1960ల్లో దీన్ని నిర్మించారు. ఉక్రెయిన్, బెలారస్ దేశాల మీదుగా పైప్ లైన్ ద్వారా పోలాండ్, స్లొవేకియా, సీజెక్ రిపబ్లిక్ తదితర దేశాలకు ఆయిల్ సప్లై అవుతుంది. ఆయిల్ డిపో పేలుడు ఘటనపై విచారణ జరుపుతామని రష్యా అధికారులు వెల్లడించారు.
The “Druzhba” oil depot in Bryansk is currently on fire after loud explosions were heard. Ukrainian missile strikes? pic.twitter.com/jQ6yHuOm6z
— Woofers (@NotWoofers) April 24, 2022
Also Read: Petrol: వాహనదారులకు బంపరాఫర్.. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా రూపాయికే లీటర్ పెట్రోల్... ఎక్కడంటే..
Also Read: Rid of Lizards: ఇంట్లో బల్లుల బెడదను పొగొట్టుకోవాలంటే ఇదే పరిష్కారం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.