Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. 31 రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా సైనికులు దాడి చేస్తున్నారు. ఆ దేశ మిలటరీ ఆపరేషన్‌ను ఉక్రెయిన్ ధీటుగా ఎదుర్కొంటోంది. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగినా ఎలాంటి పురోగతి లేదు. ఈ యుద్ధంలో ఇరువైపులా భారీగా నష్టం వాటిల్లింది. ఈక్రమంలో ఉక్రెయిన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. మే 9న రష్యా యుద్ధాన్ని ఆపనుందని ఆసక్తికర వ్యాఖ్య చేసింది.
నాజీ జర్మనీపై తమ విజయానికి గుర్తుగా మే 9న రష్యా విక్టరీ డే జరుపుకుంటోంది. ఆ రోజు రష్యావ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటుతాయి. దీని బట్టి అదే రోజున తమ దేశంపై యుద్ధాన్ని ఆపుతుందని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. 1945లో గ్రేటర్ జర్మన్ రీచ్ లొంగిపోయినందుకు గుర్తుగా విక్టరీ డేను రష్యా జరుపుకుంటోంది. ఈమేరకు ది కీవ్ ఇండిపెండెట్ మీడియా హౌజ్ ట్వీట్ చేసింది.
మరోవైపు రష్యాపై ఉక్రెయిన్ మరో సంచలన ఆరోపణ చేసింది. తమ దేశం నుంచి పౌరులను రష్యా బలగాలు బలవంతంగా మాస్కో తరలిస్తున్నారని ఆరోపించింది. వారిని బంధీలుగా చేసుకుని రాజధాని కీవ్‌ను ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తోందని మండిపడింది. దాదాపు 4 లక్షల మంది ఉక్రెయిన్ పౌరులను కిడ్నాప్ చేశారని ఆ దేశ ఆర్మీ తెలిపింది. దీనిని రష్యా బలగాలు ఖండించాయి.
తమపై ఉక్రెయిన్ తప్పుడు ప్రచారం చేస్తోందని రష్యా ఆర్మీ ఫైర్ అయ్యింది. తమ సైనికులు.. పౌరుల జోలికి పోవడం లేదని స్పష్టం చేసింది. వ్యతిరేక శక్తులపైనే తాము పోరాటం చేస్తున్నామని ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. నాటో దేశాలు తమపై ఎన్ని ఆంక్షలు పెట్టినా తమ వైఖరి ఆగదని తేల్చి చెప్పారు. రష్యాపై దుష్ప్రచారం చేస్తున్న పలు వార్త సంస్థలపై పుతిన్ బ్యాన్ విధించారు.
Also Read: RRR Collection in USA: ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్.. USA ప్రీమియర్స్ లో 3 మిలియన్ డాలర్లు!
Also Read: Ram Charan Boxing: RRR మూవీ ఆ ఒక్క సీన్ కోసం రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడో చూడండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook