Russia Sugar Crisis: చక్కెర కోసం రష్యన్ల బాహాబాహీ.. వైరల్ అవుతున్న వీడియో

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతున్న తరుణంలో రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షల విధించటంతో చాలా దేశాలు దిగుమతులు ఆపేశాయి. ఫలితంగా చక్కర కొరత ఏర్పడటంతో రష్యన్స్ షుగర్ కోసం సూపర్ మార్కెట్లో కొట్టుకుంటున్నారు. ఆ వీడియో..

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 23, 2022, 10:52 AM IST
  • రోజు రోజు ముదురుతున్న రష్యా- ఉక్రెయిన్ యుద్ధం
  • రష్యాకు దిగుమతులు ఆపేసిన వివిధ దేశాలు
  • చక్కర కోసం కొట్టుకుంటున్న రష్యన్స్
Russia Sugar Crisis: చక్కెర కోసం రష్యన్ల బాహాబాహీ.. వైరల్ అవుతున్న వీడియో

Russia Sugar Crisis: రోజురోజు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతుంది. లక్ష్యం చేరేవరకు యుద్ధం ఆపేది లేదని రష్యా అధ్యక్షడు పుతిన్ అంటుంటే.. ఎట్టి పరిస్థితుల్లో రష్యా సైనిక దాడిని తిప్పికొడతాం అంటూ ఉక్రెయిన్ సైనికులు, ప్రజలు అంటున్నారు. 

ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని పుతిన్ తీవ్రతరం చేస్తుండటం... రష్యన్లకు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షల చట్రంలో సామాన్య రష్యన్లు చిక్కుకుని విలవిలలాడుతున్నారు. చాలా దేశాలు దిగుమతులు ఆపేశాయి. దాంతో నిత్యవసరాల కొరత రష్యన్లను వెంటాడుతోంది. తాజాగా పంచదార ప్యాకెట్లను దక్కించుకునేందుకు రష్యాలో ఒకరినొకరు తోసుకుంటూ బాహాబాహీకి దిగిన దృశ్యాలు అక్కడి పరిస్థితి అద్దంపడుతోంది. 

ఒక వినియోగదారుడు పది కిలోల పంచదార మాత్రమే కొనుగోలు చేయాలంటూ రష్యాలో కొన్ని షాపింగ్ మాల్స్ పరిమితి విధించాయి. ప్రస్తుతం రష్యాలో చక్కెర కొరత వేధిస్తోంది. అలాంటిదేమీ లేదని అధికారులు చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ధరలు పెంచేందుకు తయారీదారులు నిల్వలు ఉంచుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కొరత కారణంగా పంచదార ధరలు ఆకాశాన్నంటాయి. 

ఇలాంటి పరిస్థితుల్లో చక్కెర ఎగుమతిపై పుతిన్ సర్కార్ తాత్కాలిక నిషేధం సైతం విధించింది. అసలు చక్కెర తమకు దొరకదేమోనని రష్యాలోని ఓ సూపర్ మార్కెట్లో జనం కొట్టుకున్నారు. ఆంక్షల కారణంగా రష్యాలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. 2015  తర్వాత అత్యధిక స్థాయికి చేరుకుంది.

Aslo Read: Fire Accident: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం, 11 మంది సజీవ దహనం

Aslo Read: Fire Accident: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం, 11 మంది సజీవ దహనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News