ఆధునిక నియంత, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ బతికే ఉన్నారా..? మళ్లీ ఇదే ప్రశ్న ప్రపంచం ముందుకు వచ్చి పడింది. అదేంటీ..! 2 వారాల క్రితమే కిమ్ జోంగ్ ఉన్ ప్రజాబాహుళ్యంలో కనిపించారు కదా.. అనే వార్తల వెనుక పెద్ద కథే ఉంది.
ఇప్పుడు ఆయన బతికే ఉన్నారా..? లేక చనిపోయి చాలా కాలం అయిందా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉత్తరకొరియాలో జరుగుతున్న పరిస్థితులు ఆయా ప్రశ్నలకు ఊతమిస్తున్నాయి. ఉత్తరకొరియాలోని కిమ్ ఇల్ సంగ్ స్క్వేర్‌లో కిమ్ జోంగ్ ఉన్ తండ్రి, తాతకు సంబంధించిన పెద్ద పెద్ద ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడు అకస్మాత్తుగా వాటిని తొలగించారు. దీంతో కిమ్ జోంగ్ ఉన్ అసలు బతికే ఉన్నారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కిమ్ జోంగ్ ఉన్ తండ్రి, తాత ఫోటోలను అకస్మాత్తుగా తొలగించడం వెనుక కారణాలేంటనేది తెలియడం లేదని ఉత్తర కొరియా పత్రికలు చెబుతున్నాయి. అలాగే కిమ్ జోంగ్ ఇల్కు సంబంధించిన విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారని డెయిలీ ఎక్స్ ప్రెస్ జర్నలిస్ట్ రాయ్ క్యాలీ తెలిపారు. కిమ్ జోంగ్ ఇల్ చనిపోయిన తర్వాత 2012లో కిమ్ ఇల్ స్క్వేర్ను మరమ్మతు చేశారు. అక్కడే ఆయన విగ్రహం స్థాపించారు. ఐతే ఉత్తర కొరియా సంప్రదాయాల ప్రకారం కిమ్ జోంగ్ ఉన్ చనిపోతే తప్ప.. ఆయన విగ్రహాలు లేదా ఫోటోలు పెట్టడానికి వీల్లేదని క్యాలీ తెలిపారు.
మరోవైపు కిమ్ ఇల్ సంగ్ స్క్వేర్‌లో మిలిటరీ పరేడ్లు పర్యవేక్షించే వేదికను సైతం కూల్చివేశారని నార్త్ కొరియా న్యూస్ వెల్లడించింది. ఈ విషయాన్ని శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా గమనించినట్లు తెలిపింది. అంతే కాదు కిమ్ ఇల్ సంగ్ స్క్వేర్ పడమటి వైపు ఉన్న ద్వారం గుండా వాహనాల రాకపోకలను కూడా నిషేధించారని పేర్కొంది.
గతంలో కిమ్ జోంగ్ ఉన్ చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఐతే మే 2న .. అంటే దాదాపు 20 రోజుల అనంతరం ఆయన ఓ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దర్శనమిచ్చారు. ఐతే ఇప్పుడు ఈ వీడియో పైన కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. ఆ వీడియో చాలా రోజుల క్రితం తీసిన వీడియో అని తెలుస్తోంది. దీంతో కిమ్ జోంగ్ ఉన్ ఇప్పటికే చనిపోయారనే వార్తలకు బలం చేకూరుతోంది.
మరోవైపు మే 15న ఉత్తర కొరియా సైన్యాధ్యక్షునితోపాటు సుప్రీం గార్డ్ కమాండర్‌ను కూడా కిమ్ జోంగ్ ఉన్ తొలగించారనే వార్తలు వినిపిస్తున్నాయి. వారిద్దరూ 2010 నుంచి కిమ్ జోంగ్ ఉన్ భద్రత చూస్తున్నారు. ఒకవేళ కిమ్ జోంగ్ ఉన్ చనిపోయినట్లయితే ఆయన స్థానంలో ఆయన సోదరి కిమ్ యో జోంగ్ నార్త్ కొరియా పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..