Kabul Airport Reopening: కాబూల్ విమానాశ్రయం తెరిపించే దిశగా ఖతార్ దేశం ప్రయత్నాలు

Kabul Airport Reopening: ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికన్ బలగాల ఉపసంహరణ అనంతరం కాబూల్ విమానాశ్రయాన్ని తాలిబన్లు మూసివేశారు. ఫలితంగా అంతర్జాతీయంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబూల్ విమానాశ్రయాన్ని తిరిగి తెరిపించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 2, 2021, 04:28 PM IST
  • తాలిబన్ల ఆధీనంలో కాబూల్ విమానాశ్రయం, తాత్కాలికంగా మూసివేత
  • కాబూల్ విమానాశ్రయం తిరిగి తెరిపించేందుకు చర్యలు ప్రారంభించిన ఖతార్
  • బ్రిటన్ విదేశాంగ కార్యదర్శితో కలిసి ఖతార్ విదేశాంగ మంత్రి మీడియా సమావేశం
Kabul Airport Reopening: కాబూల్ విమానాశ్రయం తెరిపించే దిశగా ఖతార్ దేశం ప్రయత్నాలు

Kabul Airport Reopening: ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికన్ బలగాల ఉపసంహరణ అనంతరం కాబూల్ విమానాశ్రయాన్ని తాలిబన్లు మూసివేశారు. ఫలితంగా అంతర్జాతీయంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబూల్ విమానాశ్రయాన్ని తిరిగి తెరిపించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

ఆఫ్ఘనిస్తాన్‌లో 20 ఏళ్లపాటు ఉన్న అమెరికన్ ఇతర బలగాలు అక్కడ్నించి నిష్క్రమించాయి. అటు అమెరికా, యూకే, ఇండియా, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు తమ దేశ పౌరుల్ని అక్కడ్నించి తరలించాయి. ఇంకొంతమంది అక్కడే చిక్కుకుపోయారు. ఆగస్టు 31 డెడ్‌లైన్ నాటికి అమెరికన్ బలగాల నిష్క్రమణ ఘట్టం పూర్తవడంతో కాబూల్ విమానాశ్రయాన్ని తాలిబన్లు తమ స్వాధీనంలో తెచ్చుకున్నారు. ఆఫ్ఘన్‌ను తాలిబన్లు ఆక్రమించినప్పటి నుంచి కాబూల్ విమానాశ్రయం తరచూ వార్తల్లో నిలిచింది. కాబూల్ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని ఐసిస్ కే(ISIS K) ఉగ్రవాదులు దాడులు సైతం జరిపారు. ఈ దాడుల్లో 180 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. 

ఇప్పుడు కాబూల్ విమానాశ్రయం(Kabul Airport) పూర్తిగా ఆధీనంలో వచ్చాక..తాత్కాలికంగా విమానాశ్రయాన్ని మూసివేశారు తాలిబన్లు. కాబూల్ విమానాశ్రయాన్ని తిరిగి తెరిపించేందుకు ప్రయత్నిస్తున్నామని ఖతార్ దేశపు విదేశాంగ మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ థని వెల్లడించారు. ఈ విషయమై తాలిబన్లతో చర్చిస్తున్నట్టు చెప్పారు. దోహాలోని బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి డోమ్మిక్ రాబ్‌తో కలిసి ఈ విషయాన్ని మీడియా సమావేశంలో ప్రకటించారు.త్వరలోనే కాబూల్ విమానాశ్రయాన్ని తిరిగి తెరిపిస్తామన్నారు.ఆఫ్ఘనిస్తాన్‌లో(Afghanistan) ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై డోమ్నిక్ రాబ్ ఖతార్ విదేశాంగ మంత్రితో చర్చించారు. బ్రిటన్ దేశస్థులు, ఆఫ్ఘన్ మద్దతుదారులను అక్కడ్నించి సురక్షితంగా తరలించే మార్గాల్ని పరిశీలించారు. ఆఫ్ఘనిస్తాన్ దేశం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించదని..మంచి ప్రభుత్వాన్ని  తాలిబన్లు అందిస్తారని భావిస్తున్నట్టుగా సమావేశంలో చర్చించారు. తాలిబన్లతో(Talibans)చర్చించే విషయం గురించి డోమ్నిక్ రాబ్ ప్రస్తావించినా..బ్రిటన్ ప్రభుత్వం తక్షణం ఆ దేశ ప్రభుత్వాన్ని గుర్తించే పరిస్థితుల్లేవని తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌లోని బ్రిటన్ దౌత్య కార్యాలయం తాత్కాలికంగా ఖతార్‌కు(Qatar) తరలించారు. ప్రస్తుతం దోహాలో నడుస్తున్న ఈ కార్యాలయాన్ని ఆఫ్ఘనిస్తాన్‌లో త్వరలో ప్రారంభించనున్నారు. 

Also read: Hurricane Ida: అమెరికాను వణికించిన హరికేన్.. రివర్ నే రివ‌ర్స్ చేసింది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News