PM speaks to Putin: 'జెలెన్‌స్కీతో నేరుగా మాట్లాడండి'.. పుతిన్​కు ప్రధాని మోదీ సూచన

PM speaks to Putin:  ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​తో  ఫోన్​లో సంభాషించారు. సుమీలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడంలో సాయం చేయాలని మోదీ కోరారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 7, 2022, 05:57 PM IST
PM speaks to Putin: 'జెలెన్‌స్కీతో నేరుగా మాట్లాడండి'.. పుతిన్​కు ప్రధాని మోదీ సూచన

PM Modi Speaks to President Putin: ఉక్రెయిన్ సంక్షోభంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో (Vladmir Putin) ప్రధాని మోదీ (PM Modi) ఫోన్‌లో మాట్లాడారు. ఇరువురు నేతలు దాదాపు 50 నిమిషాల పాటు సంభాషించుకున్నారు. ఉక్రెయిన్‌లోని సుమీ (Sumy) నగరం నుండి భారతీయులను వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించడం తమ ప్రాధాన్యత అని మోదీ పుతిన్ కు స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో (Volodymyr Zelenskyy) నేరుగా మాట్లాడాలని పుతిన్‌కు మోదీ సూచించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఉక్రెయిన్ నుండి భారతీయులను తరలించడంలో అన్ని విధాలుగా సహకరిస్తామని పుతిన్.. ప్రధాని మోదీకి హామీ ఇచ్చినట్లు సమాచారం. బాంబు దాడులు, కాల్పుల మధ్య ఈశాన్య ఉక్రెయిన్‌లోని సుమీలో దాదాపు 700 నుండి 900 మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారు. వారికి కనీస సదుపాయాలు కూడా లేవు.  ఇటీవల వారు తాగునీటి కోసం మంచును కరిగించిన వీడియో...అక్కడ దుస్థితికి అద్దం పడుతోంది. 

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం (Russia Ukraine War) ప్రారంభించిన తర్వాత ప్రధాని మోదీ.. పుతిన్‌కు ఫోన్ చేయడం ఇది రెండోసారి. ఫిబ్రవరి 25న, మోదీ.. రష్యా అధ్యక్షుడికి ఫోన్ చేసి "తక్షణమే హింసను నిలిపివేయాలని" విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా భారతీయులను సురక్షితంగా తరలించడం తమ అత్యంత ప్రాధాన్యత అని కూడా ప్రధాని నొక్కి చెప్పారు.

Also Read: Modi Thanks Zelenskyy: ఉక్రెయిన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్.. 35ని. సంభాషణ.. జెలెన్‌స్కీకి కృతజ్ఞతలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News