PM Narendra Modi congratulates Joe Biden on 'spectacular victory': న్యూ ఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ (Joe Biden) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అధ్యక్ష ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్‌కు, అదేవిధంగా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న భారత సంతతికి చెందిన కమలా హారిస్ (Kamala Harris) కు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (president Ram Nath Kovind), ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి ట్విట్టర్ వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. Also read: US Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ విజయం
ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ విధంగా ట్విట్ చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్‌కు, ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న కమలా హారిస్‌కు శుభాకాంక్షలు. బిడెన్ విజయవంతంగా తమ పదవిని నిర్వహించాలి.. భారత్-అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఎదురుచూస్తున్నాం.. అంటూ రాష్ట్రపతి ట్విట్ చేశారు.
My sincere felicitations to Joseph R. Biden on his election as President of the United States of America and @KamalaHarris, as Vice President. I wish @JoeBiden a successful tenure and look forward to working with him to further strengthen India-US relations.
— President of India (@rashtrapatibhvn) November 7, 2020
జో బిడెన్‌కు, కమలా హారిస్‌కు ప్రధాని మోదీ విడివిడిగా ట్విట్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో మీ పాత్ర అమూల్యమైనది. మీతో కలిసి పనిచేసేందుకు, ఇరు దేశాల సంబంధాలను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు ఎదురు చూస్తున్నాను అంటూ.. ప్రధాని మోదీ జో బిడెన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Congratulations @JoeBiden on your spectacular victory! As the VP, your contribution to strengthening Indo-US relations was critical and invaluable. I look forward to working closely together once again to take India-US relations to greater heights. pic.twitter.com/yAOCEcs9bN
— Narendra Modi (@narendramodi) November 7, 2020
అదేవిధంగా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న కమలా హారిస్‌కు కూడా మరో ట్విట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు మోదీ. మీ విజయం మార్గదర్శకం.. భారతీయ అమెరికన్లందరికీ గర్వకారణం. మీ సహకారంతో భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని విశ్వసిస్తున్నాను అంటూ.. ప్రధాని ట్విట్ చేశారు.
Heartiest congratulations @KamalaHarris! Your success is pathbreaking, and a matter of immense pride not just for your chittis, but also for all Indian-Americans. I am confident that the vibrant India-US ties will get even stronger with your support and leadership.
— Narendra Modi (@narendramodi) November 7, 2020
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 530 ఎలక్టోరల్ ఓట్లలో జో బిడెన్‌కు 284 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా.. డొనాల్డ్ ట్రంప్‌కు 214 ఓట్లు మాత్రమే వచ్చాయి. Also read: Kamala Harris: చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్.. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక
Also read : US Election Results: ఆ నాలుగు రాష్ట్రాల్లోనూ జో బిడెన్‌దే ఆధిక్యం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe