Miss World 2021: మిస్ వరల్డ్‌గా పోలండ్ బ్యూటీ కరోలినా బిలావ్‌స్కా, టాప్ 6కు చేరని భారత మహిళ

Miss World 2021: మిస్ వరల్డ్ 2021గా పోలండ్‌కు చెందిన కరోలినా బిలావ్‌స్కా ఎంపికైంది. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది నిల్చిపోయిన మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా పోలండ్ మహిళ నిల్చింది. టైటిల్‌పై ఆశలు పెట్టుకున్న భారత మహిళ టాప్ 6కు చేరకపోవడం గమనార్హం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 17, 2022, 02:40 PM IST
  • మిస్ వరల్డ్ 2021గా పోలండ్ బ్యూటీ కరోలినా బిలావ్‌స్కా
  • కరోనా కారణంగా నిలిచిపోయిన గత యేడాది జరగాల్సిన పోటీలు
  • టాప్ 6కు చేరని భారత మహిళ హన్సా, ఫస్ట్ రన్నరప్‌గా భారత మూలాలు కలిగిన అమెరికన్
Miss World 2021: మిస్ వరల్డ్‌గా పోలండ్ బ్యూటీ కరోలినా బిలావ్‌స్కా, టాప్ 6కు చేరని భారత మహిళ

Miss World 2021: మిస్ వరల్డ్ 2021గా పోలండ్‌కు చెందిన కరోలినా బిలావ్‌స్కా ఎంపికైంది. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది నిల్చిపోయిన మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా పోలండ్ మహిళ నిల్చింది. టైటిల్‌పై ఆశలు పెట్టుకున్న భారత మహిళ టాప్ 6కు చేరకపోవడం గమనార్హం.

రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో శరణార్ధులకు మద్దతివ్వడమే కాకుండా..భారత విద్యార్ధుల తరలింపులో సహాయపడుతూ చర్చనీయాంశమవుతున్న పోలండ్ పేరు ఇప్పుడు మరోసారి వార్తల్లో కెక్కింది. కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన మిస్ వరల్డ్ 2021 పోటీలు తిరిగి కొనసాగాయి. ఈ పోటీల్లో పోలండ్‌కు చెందిన కరోలినా బిలావ్‌స్కా విజేతగా నిలిచి దేశం పేరు ప్రఖ్యాతుల్ని మరోసారి వికసింపచేసింది. గత ఏడాది జరిగిన ఇదే టైటిల్ పోటీల్లో పాల్గొన్న చాలామంది సుందరీమణులకు కరోనా సోకింది. ఇండియాకు చెందిన మన్సా కూడా ఇందులో ఒకరు. కరోనా కారణంగా ఈ పోటీల్ని అప్పట్లో నిలిపివేశారు.

మిస్ వరల్డ్‌గా పోలండ్ మహిళ కరోలినా

మిస్ వరల్డ్ 2021గా పోలండ్‌కు చెందిన కరోలినా బిలావ్‌స్కా టైటిల్ సాధించింది. ప్యూర్టోరికోలోని కోకాకోలా మ్యూజిక్ హాల్‌లో కరోలినాకు మిస్ వరల్డ్ 2021 టైటిల్ దక్కింది. జమైకాకు చెందిన టోనీ ఎన్ సింహ్..కరోలినాకు కిరీటం తొడిగింది. అమెరికాకు చెందిన శ్రీ సైని తొలి రన్నర్‌గా నిలిచింది. అటు కోటే డీ ఐవర్‌కు చెందిన ఒలీవియా రెండవ రన్నరప్‌గా నిలిచింది. తొలి రన్నరప్‌గా నిలిచిన శ్రీసైని భారతీయ మూలాలకు చెందిన అమెరికన్ కావడం విశేషం.

ఎవరీ కరోలినా బిలావ్ స్కా

కరోలినా మేనేజ్‌మెంట్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసింది. చదువుపై కరోలినాకు ఆసక్తి ఎక్కువే. వృత్తిరీత్యా మోడల్ కూడా. భవిష్యత్‌లో మోటివేషన్ స్పీకర్ కావాలనేది ఆమె లక్ష్యం. కరోలినాకు స్విమ్మింగ్, స్కూబా డైవింగ్ చాలా ఇష్టం. దాంతో పాటు ఆటలపై కూడా మక్కువ ఎక్కువ. కరోలినాకు టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆడటం ఇష్టం.

భారత ఆశలు నీళ్లపాలు

మిస్ వరల్డ్ 2021 పోటీలు గత ఏడాది జరగాల్సి ఉన్నాయి. కానీ కరోనా వైరస్ కారణంగా ఈ ఈవెంట్‌ను నిలిపివేశారు. చాలామంది సుందరీమణులు కూడా కరోనా బారినపడ్డారు. ఆ సుందరీమణుల్లో ఇండియాకు చెందిన మన్సా కూడా ఉంది. కరోలినా విజేతగా ఎన్నికవడంతో ఇండియా ఆశలు నీరుగారిపోయాయి. మన్సా టాప్ 6లో కూడా నిలవలేకపోయింది. 

Also read; Air Pollution Sensors: ఎంతటి వాయు కాలుష్యాన్నైన పసిగట్టే సెన్సర్లు.. ఆ దేశంలో సక్సెస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News