Sonic Boom In Paris: ఫైటర్ జెట్ సౌండ్ విని వణికిపోయిన ప్యారిస్ ప్రజలు!

ఫ్రాన్స్ (France) రాజధాని ప్యారిస్ ( Paris ) బుధవారం ఉలిక్కిపడింది. భారీ పేలుడు లాంటి శబ్దం వల్ల ప్రజలు వణికిపోయారు.

Last Updated : Sep 30, 2020, 10:38 PM IST
    • ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ బుధవారం ఉలిక్కిపడింది.
    • భారీ పేలుడు లాంటి శబ్దం వల్ల ప్రజలు వణికిపోయారు.
    • పేలుడు శబ్దం ఎంత భయంకరంగా ఉందంటే ఇంటి గోడలు కూడా కదిలిపాయాయి.
Sonic Boom In Paris: ఫైటర్ జెట్ సౌండ్ విని వణికిపోయిన ప్యారిస్ ప్రజలు!

ఫ్రాన్స్ (France) రాజధాని ప్యారిస్ ( Paris ) బుధవారం ఉలిక్కిపడింది. భారీ పేలుడు లాంటి శబ్దం వల్ల ప్రజలు వణికిపోయారు. పేలుడు శబ్దం ఎంత భయంకరంగా ఉందంటే ఇంటి గోడలు కూడా కదిలిపాయాయి. బీరుట్ లాంటి పేలుడు సంభవించిందేమో అని అంతా భయపడ్డారు. ఇలాంటిది ఏమీ జరగలేదు అని పోలీసులు స్పష్టం చేశారు. ఎలాంటి పేలుడు జరగలేదు అని తెలపడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

ALSO READ| Rice ATM : హైదరాబాద్ లో 12 వేల మంది కడుపు నింపిన రైస్ ఏటీఎం

బ్లాస్ట్ శబ్దానికి కారణం ఇదే
బుధవారం రోజు ప్యారిస్ లో భారీ శబ్దం వినిపించడంతో దాని గురించి అక్కడి ప్రజలు బాగా చర్చించుకోవడం మొదలు పెట్టారు. ఏం జరిగిందో పోలీసులు చెబితే కానీ ఎవరీకీ తెలియలేదు. పైగా పోలీసులకు ఫోన్ చేయడంతో గందరగోళ వాతావరణం నెలకొంది.  

అయితే తరువాత తెలిసిన విషయం ఏంటంటే ఇది Blast కాదు అని.. అది Sonic Boom అని తెలిసింది. జెట్ ప్లేన్ సౌండ్ బ్యారియర్ బ్రేక్ చేయడంతో ఇలా సౌండ్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఏదైనా జెట్ అత్యంత వేగంగా ప్రయాణిస్తోంటే చిన్నపాటి విస్పోటం జరుగుతుంది.  అందులో వచ్చే సౌండే సోనిక్ బూమ్

సౌండ్ బ్యారియర్ బ్రేక్..
ప్యారిస్ గగనతలం నుంచి వెళ్తున్ ఒక ఫైటర్ జెట్ ( Jet ) భారీ విస్పోటనం వాంటి శబ్దం (Blast like Sound) చేసి వెళ్లింది. దీని తీవ్రత ఎంతగా ఉందంటే నలుదిక్కుల్లో దాని ప్రతిధ్వని వినిపించింది. అయితే దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని పోలీసులు తెలిపారు. 

ఈ శబ్దం వినిపించే సమయంలో ఫ్రెంచ్ ఓపెన్ పోటీలు కూడా జరుగుతున్నాయి. సౌండ్ వినడంతో ఒక్కసారిగా ఆటగాళ్లు కూడా హైరానా పడ్డారు.

ALSO READ| Doppelgänger: మనుషులను పోలిన మనుషులు అంటాం కదా.. వీళ్లే వాళ్లు.. 

కొన్ని క్షణాల పాటు ఆట నిలిచిపోయింది.

సోనిక్ బూమ్ ఎలా ఉంటుందో చూడండి...

Trending News