North Korea COVID-19 Outbreak : కరోనా మహమ్మారి ఉత్తర కొరియాపై పంజా విసురుతోంది. ప్రపంచమంతా కరోనా బారిన పడి కుదేలైనా.. తమ దేశంలో కరోనా ఊసే లేదని సాక్షాత్తూ అధ్యక్షుడు కిమ్ ప్రకటించారు. రెండేళ్లుగా ఉత్తరకొరియాలో కరోనా ఆనవాళ్లు అస్సలే లేవని చెప్పుకున్న కొరియా ఇప్పుడు చిగురుటాకులా వణికిపోతోంది. మహమ్మారి బారినపడి మరో 15 మంది కొత్తగా బలయ్యారని కొరియా అధికారిక మీడియా ‘కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA)’ ప్రకటించింది. ఇప్పటి వరకు దేశంలో 42 మంది ప్రాణాలు కోల్పాయారని తెలిపింది. కొరియాలో కొత్తగా 2,96,180 మంది కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతున్నారని కేసీఎన్‌ఏ పేర్కొంది. ఇప్పటి వరకు కొరియాలో మొత్తం 8,20,620 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. తొలి కేసును గుర్తించామని చెప్పిన మూడు రోజులకే కేసులు ఈ స్థాయిలో పాజిటివ్‌గా రావటం కలవర పెడుతోంది. ఇది తీవ్ర సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు.
ఉత్తరకొరియాలో క్షేత్రస్థాయిలో ఆరోగ్య వ్యవస్థ ఇప్పటికీ బలహీనంగానే ఉంది. మహమ్మారి ప్రవేశాన్ని నిలువరించే చర్యల్లో భాగంగా కొరియా విదేశాలతో పూర్తిగా సంబంధాలను తెగదెంపులు చేసుకొంది. వైరస్‌ను గుర్తించడానికి కావాల్సిన కిట్లు కూడా లేవని తెలుస్తోంది. మహమ్మారి విజృంభిస్తే అనేక మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మహమ్మారి కట్టడికి పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు చెబుతోంది. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారని, 12 లక్షల మంది వైద్య సిబ్బంది రంగంలోకి దిగారని పేర్కొంది. వీళ్లంతా జనంలో లక్షణాలు గుర్తించి పరీక్షలు చేస్తారని, వైరస్ వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఐసోలేషన్ కేంద్రాలను భారీ సంఖ్యలో ఏర్పాటు చేస్తోంది ఉత్తర కొరియా ప్రభుత్వం.
మహమ్మారి నివారణకు దేశవ్యాప్తంగా అక్కడి ప్రభుత్వం కఠిన లాక్‌డౌన్ అమలు చేస్తోంది. అయితే, ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న దేశంలో ఆంక్షలు పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే తీవ్ర ఆహార, ఆరోగ్య సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర కొరియాకు వ్యాక్సిన్లు అందించేందుకు, మహమ్మారిని అదుపు చేసేందుకు కావాల్సిన సాయమందించేందుకు, ఆపన్న హస్తం అందించేందుకు చైనా, దక్షిణ కొరియా ముందుకొచ్చాయి. కానీ, ఇప్పటికైతే కిమ్ ప్రభుత్వం మాత్రం ఆయా దేశాల సాయం అంగీకరించేందుకు ముందుకు రాలేదు.
Also Read - Minister Harish Rao: అమిత్ షా కాదు..అబద్ధాల షా..మంత్రి హరీష్‌రావు సెటైర్లు..!
Also Read - Ys Sharmila comments: రైతులను చంపిన చరిత్ర బీజేపీది..వైఎస్ షర్మిల ఫైర్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook