Monkeypox Alert: ప్రపంచ దేశాలను మరో వైరస్ వణికిస్తోంది. ఓపక్క కరోనా మహమ్మారి గుబులు పుట్టిస్తుంటే..మరోపక్క మంకీపాక్స్ వైరస్ కలకలంరేపుతోంది. ఇప్పటికే 50 దేశాలకు విస్తరించింది. మొత్తం 200లకుపైగా కేసులు బయట పడ్డాయి. మరో వందకు పైగా అనుమానిత కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. మంకీపాక్స్ పేరు వినగా ప్రజలంతా జంకిపోతున్నారు. భారత్‌లోనూ ఈవైరస్ కలవరం పెడుతోంది.
కొత్త వైరస్ కోరలు చాస్తుండటంతో పరిశోధనలు ముమ్మరం అయ్యాయి. ఈక్రమంలో మనదేశంలో పరిశోధనలను మొదలు పెట్టారు. మెడికల్ పరికరాల తయారీ సంస్థ ట్రివిట్రాన్ హెల్త్‌కేర్..పరిశోధనలు చేసింది. మంకీపాక్స్‌ను గుర్తించేందుకు ఓ రియల్ టైమ్ పీసీఆర్ కిట్‌ను తయారు చేసింది. ట్రివిట్రాన్ హెల్త్ కేర్‌కు చెందిన రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ బృందం ఆర్‌టీ-పీసీఆర్ కిట్‌ను రూపొందించింది. నాలుగు రంగుల ఫ్లోరోసెన్స్ ఆధారిత కిట్‌గా ఉంటుందని బృందం సభ్యులు తెలిపారు.
వన్ ట్యూబ్ సింగిల్ రియాక్షన్ ఫార్మాట్‌లో స్మాల్ పాక్స్, మంకీపాక్స్ ఉన్న తేడాను ఇట్టే గుర్తించగలదు. ఆర్‌టీ-పీసీఆర్ కిట్ ద్వారా గంటలోనే ఫలితం వస్తుందని పరిశోధకులు వెల్లడించారు. ఈకిట్‌తో టెస్ట్ చేసుకునేందుకు పొడి స్వాబ్‌లతోపాటు వీటీఎం స్వాబ్‌లను ఉపయోగించుకునే అవకాశం ఉంది. మంకీ పాక్స్ వైరస్ కట్టడికి తక్షణ చర్యలు అవసరమన్నారు ఆ సంస్థ సీఈవో చంద్ర గంజూ. ఈ విషయంలో ప్రపంచ దేశాలకు సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు.
బ్రిటన్, స్పెయిన్, పోర్చుగల్, కెన్యా, అమెరికా సహా 20 దేశాల్లో మంకీపాక్స్ కలవరపెడుతోంది. వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. మంకీ పాక్స్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఇటు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్నికేసులు పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ వైరస్‌కు మశూచికి వాడే టీకాలు పనిచేస్తాయా అన్న దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి. త్వరలో దీనిపై డబ్ల్యూహెచ్‌వో నిపుణులు ఓ ప్రకటన చేయనున్నారు.
మంకీపాక్స్ సోకిన వారికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా జ్వరం, ఒళ్లు నొప్పులు, చలి, అలసట వంటి లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి ముఖం, చేతులపై దద్దుర్లు, చిన్న బొబ్బలు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. మంకీపాక్స్ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రపంచదేశాలు అలర్ట్ అయ్యాయి.
Also read:Turmeric On Face Benefits: పసుపును చర్మానికి అతిగా వినియోగిస్తున్నారా..అయితే ప్రమాదమే..!!
Also read:Neelam stone: నీలమణి రాయిని ఆ రెండు రాశుల వారే ఎందుకు ధరించాలి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook