Missiles attack: అమెరికా దౌత్య కార్యాలయంపై మిస్సైల్ దాడులు!

Missiles attack: అమెరికా దౌత్యకార్యాలయంపై ఇరాక్​లో క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిసింది. అయితే ఈ దాడులకు బాద్యులు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. ఏ దాడులపై అమెరికా భద్రత సిబ్బంది ఏం చెప్పిందంటే...

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 13, 2022, 11:04 AM IST
  • ఇరాక్​లో మిస్సైల్​ దాడులు
  • అమెరికా దౌత్య కార్యాలయమే లక్ష్యం!
  • ఎలాంటి నష్టం వాటిళ్లేలని భద్రతా సిబ్బంది వెల్లడి
Missiles attack: అమెరికా దౌత్య కార్యాలయంపై మిస్సైల్ దాడులు!

Missiles attack: ఉత్తర ఇరాక్​లోని ఇర్బిల్​ పట్టణంలో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయంపై మిస్సైల్ దాడులు జరిగాయి. కనీసం పన్నెండు క్షిపణులు అమెరికా కాన్సులెట్ వైపు దూసుకొచ్చినట్లు అమెరికా భద్రతా వర్గాలు తెలిపాయి. ఈ దాడులు ఇరాన్​కు సమీప దేశాల నుంచి జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం తెల్లవారు జామున ఈ దాడులు జరిగినట్లు పేర్కొన్నారు.

అయితే మిస్సైల్​ దాడుల్లో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అమెరికా భద్రతా సిబ్బంది ఒకరు చెప్పారు. ఇదిలా ఉండగా ఇరాక్ భద్రతా సిబ్బంది మాత్రం కొన్ని క్షిపణులు దౌత్య కార్యాలయాన్ని తాకినట్లు వెల్లడించారు. అయితే అది కొత్త భవనమని అందులో ప్రస్తుతానికి ఎవరూ లేరని ఉండటం లేదని వెల్లడించారు.

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. క్షిపణులు నేరుగా భవనాన్ని తాకలేదని తెలిసింది. అయితే రాయబార కార్యాలయం పరిసరాల్లో మాత్రం మిస్సైల్స్​ వల్ల నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

ఈ మిస్సైల్ దాడులు ఎవరు చేశారానే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని ఇరాక్ అధికారులు తెలిపారు. ఈ దాడులను ఖండిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఇరాన్ నుంచి దాడులు జరిగి ఉంటాయనే అనుమానాలు మాతరం వ్యక్తమవుతున్నాయి.

Also read: Ponytail Ban: ఆ ప్రాంతంలో పోనీటెయిల్స్ నిషేధం.. అమ్మాయిలు అలాంటి లోదుస్తులే వాడాలి!

Also read: McDonald's Burger: మెక్‌డొనాల్డ్స్ బర్గర్‌ ధర రూ.26,000.. పోటీపడి మరీ కొంటున్న ఫుడీస్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News