Russia-Ukraine Conflict: ఉక్రెయిన్‌లోని భారతీయులకు అలర్ట్.. ఆ దేశాన్ని వీడాలన్న భారత్..

Indian Embassy in Ukraine urges Indians to Leave that Country: ఉక్రెయిన్‌-రష్యా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి.. ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఉక్రెయిన్‌లోని భారతీయులు ఆ దేశాన్ని వీడాల్సిందిగా భారత్ సూచించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2022, 08:03 PM IST
  • ఉక్రెయిన్‌-రష్యా ఉద్రిక్తతలు
  • ఉక్రెయిన్‌పై యుద్ధానికి కాలు దువ్వుతున్న రష్యా
  • భారతీయులను వెనక్కి రప్పించేందుకు భారత్ ప్రయత్నాలు
Russia-Ukraine Conflict: ఉక్రెయిన్‌లోని భారతీయులకు అలర్ట్.. ఆ దేశాన్ని వీడాలన్న భారత్..

Indian Embassy in Ukraine urges Indians to Leave that Country: ఉక్రెయిన్‌లోని భారతీయులకు భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌లో నెలకొన్న అనిశ్చితి.. ఏ క్షణమైనా రష్యా దాడికి పాల్పడవచ్చుననే హెచ్చరికల నేపథ్యంలో.. తాత్కాలికంగా ఆ దేశాన్ని వీడాలని భారతీయులకు సూచించింది. ఉక్రెయిన్‌లో ఉండటం అనివార్యం కానప్పుడు.. ఇప్పటికైతే ఆ దేశాన్ని వీడాలని సూచించింది. ఈ మేరకు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని భారత దౌత్య కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది.

'ఉక్రెయిన్‌లో నెలకొన్న హైటెన్షన్ వాతావరణం, అనిశ్చితి దృష్ట్యా అక్కడి భారతీయులంతా తాత్కాలికంగా ఆ దేశాన్ని వీడమని చెబుతున్నాం.' అని ఆ ప్రకటనలో భారత దౌత్య కార్యాలయం పేర్కొంది. ఉక్రెయిన్‌లో అందుబాటులో ఉన్న కమర్షియల్ ఫ్లైట్స్, చార్టర్ విమానాల ద్వారా ఆ దేశాన్ని వీడాలని సూచించింది. భారతీయ విద్యార్థులు స్టూడెంట్ కాంట్రాక్టర్లతో టచ్‌లో ఉండాలని.. తద్వారా చార్టర్ విమానాల అప్‌డేట్స్ పొందవచ్చునని తెలిపింది. 

ఈ-ఎంబసీ ఫేస్‌బుక్, వెబ్‌సైట్, ట్విట్టర్ ద్వారా కూడా అప్‌డేట్స్ పొందవచ్చునని పేర్కొంది. 2020కి సంబంధించిన అధికారిక డాక్యుమెంట్ ప్రకారం.. ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థుల సంఖ్య 18వేల వరకు ఉంది.  ఇప్పటికే అమెరికా, కెనడా, పోర్చుగల్ తదితర దేశాలు ఉక్రెయిన్‌లోని తమవారిని వెనక్కి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశాయి. 

ఈ నెల 16న ఉక్రెయిన్‌పై రష్యా దాడికి పాల్పడే అవకాశం ఉందంటూ అమెరికా నిఘా వర్గాలు చేసిన ప్రకటనతో.. ఒక్కసారిగా యుద్ధ భయం మొదలైంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా 1,30,000 మంది సైనికులను మోహరించడం యుద్ధ సంకేతాలను పంపించినట్లయింది. దీంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పుతిన్‌తో సంప్రదింపులు జరిపి యుద్ధం వద్దని కోరారు. ఒకవేళ యుద్ధానికి దిగితే రష్యా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోవైపు, యుద్దం తమ ఉద్దేశం కాదని చెబుతూనే.. ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించిన తమ సైన్యాన్ని రష్యా ఉపసంహరించుకోవట్లేదు. ఈ పరిణామాలు మున్ముందు ఎక్కడికి దారితీస్తాయోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తమ పౌరులను ఉక్రెయిన్ నుంచి వెనక్కి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. 

Also Read: Pawan Kalyan Rally: ర్యాలీలో అపశ్రుతి.. జనసేనాని పవన్ కల్యాణ్ కు తప్పిన ప్రమాదం! (Video)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News