Intel plans to cut employee salaries by 25 percent including CEO to avoid Lay Offs: ఆర్ధిక మాంద్యం భయాందోళనల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఐటీ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. కంపెనీపై అదనపు భారాన్ని తొలగించుకుని.. నష్టాల నుంచి బయటపడేందుకే 'లే ఆఫ్' ప్రకటిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, ట్విటర్, స్విగ్గీ, ఫిలిప్స్, ఓఎల్ఎక్స్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. అయితే మిగతా కంపెనీలకు భిన్నంగా టెక్ దిగ్గజ సంస్థ ఇంటెల్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులను తొలగించకుండా.. వారి జీతాల్లో కోత విధించిననున్నట్లు పేర్కొంది.
ఇంటెల్ తాజా నిర్ణయంతో అన్ని స్థాయిలలోని ఉద్యోగుల జీతాలు ప్రభావితం అవుతాయి. ఇంటెల్ కంపెనీ సీఈవో, ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగుల నుంచి.. కింది స్థాయి ఉద్యోగుల వరకు ఈ నిబంధనను అమలు చేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఇంటెల్ సీఈవో పాట్ గెల్ సింగర్‌కు 25 శాతం, ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగులకు 15 శాతం, సీనియర్ మేనేజర్లకు 10 శాతం, మధ్యస్థాయి మేనేజర్లకు 5 శాతం కోత విధించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
'ఆర్థిక మాంద్యం రాబోతుందన్న అంచనాల నేపథ్యంలో కంపెనీపై ఆర్థిక పరమైన భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని నిర్ణయించాం. కంపెనీ భవిష్యత్తు నిర్ణయాలకు ఇది ఎంతో దోహదపడుతుంది. ఇది కఠిన నిర్ణయం. అన్ని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం' అని ఇంటెల్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇంటెల్ తాజా నిర్ణయంతో కింది స్థాయి ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి ఉద్యోగం పోనందుకు చాలా మంది సంతోషిసున్నారు.
ప్రస్తుతం ఉద్యోగులను తొలగించని ఏకైక పెద్ద సంస్థగా 'యాపిల్' ఉంది. శ్రామిక శక్తిని తగ్గించడానికి కఠినమైన చర్యలు తీసుకోకుండా.. కంపెనీ సీఈవో టిమ్ కుక్ జీతంలో 40 శాతం కోత విధించింది. అదే మార్గంలో ఇప్పుడు ఇంటెల్ వెళ్లింది. గత కొన్నేళ్లుగా పీసీ చిప్ మార్కెట్‌లో ఇంటెల్ తన ఆధిపత్యాన్ని కొనసాగింది. కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో.. అమ్మకాలు నెమ్మదించాయి. మరోవైపు చిప్ సెట్ రంగంలో ఏఎమ్‌డీ నుంచి ఇంటెల్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది.
Also Read: IND vs NZ: శుభ్‌మన్ గిల్ సెంచరీ.. మూడో టీ20లో భారత్ ఘన విజయం! 2-1తో సిరీస్ కైవసం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.