Twitter on Trump Account: ట్రంప్ ఎక్కౌంట్ బ్యాన్ పై ఆయన సమాధానం వింటే హ్యాట్సాఫ్ అనక తప్పదు..

Twitter on Trump Account: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అక్కౌంట్ బ్యాన్ నిజంగానే ఓ సంచలన విషయం. ట్రంప్ అక్కౌంట్ బ్యాన్‌పై ఆ సంస్థ సీఈవో చెప్పిన మాటలు వింటే నిజంగా ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పక తప్పదు..

Last Updated : Jan 14, 2021, 02:07 PM IST
Twitter on Trump Account: ట్రంప్ ఎక్కౌంట్ బ్యాన్ పై ఆయన సమాధానం వింటే హ్యాట్సాఫ్ అనక తప్పదు..

Twitter on Trump Account: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అక్కౌంట్ బ్యాన్ నిజంగానే ఓ సంచలన విషయం. ట్రంప్ అక్కౌంట్ బ్యాన్‌పై ఆ సంస్థ సీఈవో చెప్పిన మాటలు వింటే నిజంగా ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పక తప్పదు..

అమెరికా ( America ) లోని క్యాపిటల్ భవనం ) Capitol Hills Building ) పై గత వారం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) మద్దతుదారులు దాడి చేసి..హింసను రాజేయడం తెలిసిందే. ఈ ఘటన అనంతరం ట్విట్టర్ సంస్థ ట్రంప్ ఎక్కౌంట్‌ను శాశ్వతంగా నిషేధించింది. అనంతరం ట్రంప్ మద్దతుదారులకు చెందిన 70 వేల ఎక్కౌంట్లను కూడా రద్దు చేసింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్నది ట్రంప్‌పై ఉన్న అభియోగం. భవిష్యత్ తో ఇలాంటి విధ్వంసకర చర్యలు జరగకూడదనే ఉద్దేశ్యంతో ఎక్కౌంట్ రద్దు చేసినట్టు ట్విట్టర్ ప్రకటించింది.

Also read: Impeachment: డోనాల్డ్ ట్రంప్‌పై అభిశంసన తీర్మానం

అయితే డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఎక్కౌంట్ బ్యాన్ ( Trump Twitter Account Ban )‌పై ఆ సంస్థ సీఈవో జాక్ డోర్సే చెప్పింది వింటే హ్యాట్సాఫ్ అనకతప్పదు. అక్కౌంట్ బ్యాన్‌పై తాను గర్వపడటం లేదని..ఇలాంటి చర్యలతో మాట్లాడే స్వేచ్ఛను హరించినట్టేనని జాక్ డోర్సే ( Jack Dorsey ) అభిప్రాయపడ్డారు. స్పష్టమైన మినహాయింపులున్నప్పటికీ..నిషేధం విధించాల్సి వచ్చిందంటే ఆరోగ్యకరమైన సంభాషణను ప్రోత్సహించడంలో తాము విఫలమైనట్టు భావిస్తున్నట్టు డోర్సే చెప్పడం ఆయన గొప్పతనానికి నిదర్శనం.

ఆన్‌లైన్ ప్రసంగంతో ఆఫ్‌లైన్‌లో హాని కలగడమనేది వాస్తవం. ఈ కారణంగా బ్యాన్ విధించడం సరైన చర్యే. కానీ ప్రజా సంభాషణను విచ్ఛిన్నం చేస్తుంది. విభజన, స్పష్టత, విముక్తి, అభ్యాసాలు సామర్ధ్యాన్ని పరిమితం చేస్తాయని..ఈ తరహా ముందస్తు చర్యలు ప్రమాదకరంగా తాను భావిస్తున్నట్టు జాక్ తెలిపారు. ఈ తరహా చర్యల వల్ల ఇంటర్నెట్ ఉద్దేశం, ప్రయోజనాలు దెబ్బతింటాయని జాక్ డోర్సే ఆందోళన వ్యక్తం చేశారు. 

ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిషేధం తప్పనప్పటికీ..మంచి పరిణామం కాదని అంగీకరించడం నిజంగానే గొప్ప పరిణామంగా పలువురు విశ్లేషిస్తున్నారు.

Also read: Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరో షాక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News