ప్రాణాంతక కరోనా వైరస్ (Coronavirus) చైనాలో పుట్టినా దాని ప్రభావం మాత్రం ఎక్కువగా చవిచూసింది ఇటలీవాసులు. చైనాలో కరోనా మరణాలు తగ్గుముఖం పట్టగా, ఇటలీలో రోజురోజుకూ పరిస్థితి చేయి దాటి పోతోంది. ఆదివారం ఒక్కరోజే ఇటలీలో 651 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో ఇటలీలో కరోనా మరణాల సంఖ్య 5,476కు చేరుకుంది. శనివారం ఒక్కరోజే ఇటలీలో కరోనా వైరస్ బారిన పడి 793 మంది మృత్యువాతపడ్డ విషయం తెలిసిందే. ఇటలీలో కరోనా మృత్యుఘోష.. శనివారం రికార్డు మరణాలు
కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య ఆదివారం నాటికి 59,138కి చేరుకుందని సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తెలిపింది. శనివారం వరకు ఈ సంఖ్య 53,578గా ఉంది. సంతోషకరమైన విషయం ఏంటంటే కరోనా నుంచి ఆదివారం 7,024 మంది పూర్తిగా కోలుకున్నారు. కాగా, ఐసీయూలో ఇంకా 3,009 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాను వాడేస్తున్న పులిహోర రాజాలు..!
మిలన్ నగరం సమీపంలోని ఉత్తర లోంబార్డీ ప్రాంతంలోనే దేశంలోని సగం కంటే ఎక్కువ మరణాలు సంభవించాయి. లోంబార్డీలోనే 3,456 మందిని కరోనా వైరస్ బలితీసుకుంది. ఇక్కడ 27,206 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. కాగా, గత మూడు రోజుల వ్యవధిలో 2000 మంది వైరస్ బారిన పడి చనిపోవడం ఇటలీని అల్లకల్లోలం చేస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..