Baghdad Bomb Blast: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో భారీ ఆత్మాహుతి దాడి, 35 మంది మృతి

Baghdad Bomb Blast: ఇరాక్‌లో మరో ఘోరం చోటుచేసుకుంది. రాజధాని నగరం బాగ్దాద్‌లో భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. దాడి ఘటనలో 35 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 20, 2021, 11:46 AM IST
Baghdad Bomb Blast: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో భారీ ఆత్మాహుతి దాడి, 35 మంది మృతి

Baghdad Bomb Blast: ఇరాక్‌లో మరో ఘోరం చోటుచేసుకుంది. రాజధాని నగరం బాగ్దాద్‌లో భారీ ఆత్మాహుతి దాడి జరిగింది.దాడి ఘటనలో 35 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.

ఇస్లామిక్ స్టేట్ సంస్థ ఐసిస్(ISIS) మరోసారి ఉగ్రదాడికి పాల్పడింది. ఇరాక్ రాజధాని నగరం బాగ్దాద్ లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది. బక్రీద్ సందర్భంగా బాగ్దాద్ నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడి జరిపింది. పండుగను లక్ష్యంగా చేసుకుని భారీ కుట్రకు పాల్పడటమే కాకుండా దాడి చేసింది తామేనని కూడా ఐసిస్ ప్రకటించుకుంది. బాగ్దాద్(Bagdhad) శివారు నగరమైన సద్ర్‌లోని రద్దీగా ఉన్న మార్కెట్‌లో బాంబు పేలుడు జరగడంతో ఈ ప్రాంతమంతా రక్తపు ముద్దలతో భీకరంగా మారింది.ఇప్పటి వరకూ ఈ ఘటనలో 35 మరణించగా..60మందికి తీవ్ర గాయాలయ్యాయి.

సద్ర్(SADR) నగరంలోని వహాయిలత్ మార్కెట్‌లో బక్రీద్ (Bakrid)సందర్బంగా భారీగా జనం గుమిగూడారు.ఈ సమయంలో మిలిటెంట్లు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.మార్కెట్ రద్దీగా ఉండటంతో ఎటు చూసినా తెగిపడిన అవయవాలు, రక్తపు ముద్దలే దర్శనమిచ్చాయి. మృతుల్లో ఎక్కువగా మహిళలు, పిల్లలున్నారు.గాయపడినవారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరగవచ్చు. ఆత్మాహుతిదాడిలో స్థానికంగా తయారు చేసిన పేలుడు పదార్ధాన్ని ఉపయోగించినట్టు అధికారులు నిర్ధారించారు.ఇరాక్ (Iraq)అధ్యక్షుడు ఈ దాడిని క్రూరమైన నేరంగా అభివర్ణించారు.ఏడాది వ్యవధిలో ఇది మూడవ దాడి.

Also read: World Corona Update: ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఎన్ని కరోనా వైరస్ కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News