Elon Musk: ఇంటర్నెట్‌ సేవలను అందిస్తే చంపేస్తారా..?

Elon Musk: ఎలాన్‌ మస్క్‌ చేసిన ఓ ట్వీట్‌ చర్చనీయాంశమవుతున్నది. ఇంతకీ మస్క్‌ చేసిన ఆ ట్వీట్‌ ఏంటీ.. అసలు ఎందుకలా చేయాల్సి వచ్చింది..?  

Written by - ZH Telugu Desk | Last Updated : May 9, 2022, 02:33 PM IST
  • అనుమానాస్పదంగా మరణిస్తే అంటూ మస్క్‌ ట్వీట్‌
  • మస్క్‌ కు రష్యా నుంచి బెదిరింపులు
  • ట్విట్టర్‌ లో పోస్టు చేసిన మస్క్‌
Elon Musk: ఇంటర్నెట్‌ సేవలను అందిస్తే చంపేస్తారా..?

 Elon Musk: ప్రపంచ కుబేరుడైన ఎలాన్‌ మస్క్‌ ఇటీవల ట్విట్టర్‌ ను చేజిక్కుంచుకున్నారు. సోషల్‌ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌ గానూ ఉంటారు. అలాంటి మస్క్‌ తాజాగా ఓ ట్వీట్‌ చేశారు. తాను అనుమానాస్పదంగా మరణిస్తే అంటూ ఓ ట్వీట్‌ చేశాడు. ఇప్పుడా ఆ ట్వీట్‌ పైనే అందరూ చర్చించుకుంటున్నారు. ప్రపంచ కుబేరుడైన మస్క్‌ ఇలాంటి ట్వీట్‌ చేయడమేంటి అని ఆశ్చర్యపోతున్నారు.

అంతే కాదు దానికి ముందు మస్క్‌ చేసిన కొన్ని ట్వీట్లు ఇప్పుడు చర్చనీయంశంగా మారాయి. రష్యా అంతరిక్ష సంస్థ డైరెక్టర్‌ అయిన రోగోజిన్‌.. మస్క్‌ కు ఓ మేసేజ్‌ పంపాడు. రోగోజిన్‌ చేసిన టెలిగ్రామ్‌ పోస్టును మస్క్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశాడు. రష్యాన్‌ భాషలో ఉన్న ఆ మేసేజ్‌ ను ఇంగ్లీష్‌ లోకి అనువదించాడు. ఉక్రెయిన్‌ కు మిలిటరీ కమ్యూనికేషన్‌ పరికరాలు అందిస్తున్నందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని రోగోజిన్‌ మస్క్‌ కు వార్నింగ్‌ ఇచ్చాడు. మేరియపోల్‌ లో ఉక్రెయిన్‌ బలగాలకు మస్క్‌ తన స్టార్‌ లింక్‌ ఇంటర్నెట్‌ సేవలను అందిస్తున్నట్టు బందీగా చిక్కిన ఓ ఉక్రెయిన్‌ సోల్జర్‌ చెప్పాడని రోగోజిన్‌ మస్క్‌ కు రాసిన పోస్టులో ఉంది.  అంతేకాదు మస్క్‌ నియంతృత్వ శక్తులకు సహకరిస్తున్నారని  రోగోజిన్‌ రష్యాన్‌ మీడియాకు కూడా  చెప్పాడని మస్క్‌ తన ట్విట్టర్‌ లో పోస్టు చేశాడు. తనను నాజిలతో పోల్చడంపై మస్క్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.

ఉక్రెయిన్‌ లో ఇంటర్నెట్‌ సేవలకు రష్యా అంతరాయం కలిగించింది. ఇంటర్నెట్‌ సేవలకోసం మార్చి 19వ తేదీన ఉక్రెయిన్‌ మంత్రి మస్క్‌ను ట్విట్టర్‌ ద్వారా సాయం కోరారు. వెంటనే స్పందించిన మస్క్‌.. తన స్టార్‌ లింక్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలను ఉక్రెయిన్‌ లో అందుబాటులోకి తీసుకొచ్చారు. స్టార్‌ లింక్‌ ఇంటర్నెట్‌ సేవలను ఉపయోగించుకుని ఉక్రెయిన్‌ రష్యాన్‌ ట్యాంకులపై డ్రోన్లతో దాడి చేస్తుందని రష్యాన్‌ మీడియా తెలిపింది. 

రష్యా గతంలోనూ పలువురిపై విషప్రయోగం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో మస్క్‌ తన మరణంపై ట్వీట్‌ చేయడం కొన్ని అనుమానాలకు తావిస్తోంది. ఉక్రెయిన్‌ కు సపోర్ట్‌ గా నిలవడంపై సీరియస్‌ గా ఉన్న రష్యా మస్క్‌ ను గట్టిగానే బెదిరించి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

Also Read:కామారెడ్డి రోడ్డు ప్రమాద మృతులకు రాష్ట్ర సర్కార్ ఆర్థిక సాయం.. మోదీ ప్రకటన తర్వాత స్పందించిన కేసీఆర్...

Also Read:Curd Benefits For Hair: పెరుగుతో జుట్టుకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Facebook , Twitterమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

  

Trending News