Fire in indonesia: జకార్తాలో భారీ అగ్ని ప్రమాదం.. 16 మంది దుర్మరణం, 50 మందికి గాయాలు..

Indonesia Oil Depot Fire: ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రభుత్వ ఇంధన డిపోలో మంటలు చెలరేగి.. 16 మంది మృత్యువాత పడ్డారు. అనేక మంది గాయపడ్డారు. 

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 4, 2023, 11:37 AM IST
Fire in indonesia: జకార్తాలో భారీ అగ్ని ప్రమాదం.. 16 మంది దుర్మరణం, 50 మందికి గాయాలు..

Fire in indonesia: ఇండోనేషియా రాజధాని జకార్తాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రభుత్వానికి చెందిన ఆయిల్ డిపోలో మంటలు చెలరేగడంతో 16 మంది మృతి చెందారు. 50 మంది గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.  శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. మంటలను అదుపు చేసినట్లు ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డుదుంగ్ అబ్దురాచ్‌మన్ వెల్లడించారు. 250 కంటే ఎక్కువ అగ్నిమాపక సిబ్బంది, 51 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలంలో మోహరించినట్లు జకార్తాలోని ప్రధాన అగ్నిమాపక కేంద్రం తెలిపింది. 

ఇండోనేషియా ఇంధన అవసరాల్లో 25 శాతం మేర ఉత్తర జకార్తాలో నడిచే ఈ ఆయిల్ డిపో నుంచే సరఫరా అవుతుంది. ఈ మంటలు వ్యాపించడానికి కారణాలు మాత్రం పూర్తిగా తెలియరాలేదు. శుక్రవారం పిడుగులతో కూడిన వర్షం కురిసింది. దీని కారణంగానే మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు. సమీప ప్రాంతాల్లోని వేలాది మంది ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. ఈ ఫైర్ యాక్సిడెంట్ వల్ల దేశ ఇంధన సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగలేదని వారు తెలిపారు.

గతంలో..
2009లో ఇదే డిపోలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 2014లో మళ్లీ ఈ డిపోకు సమీపంలోని పేలుడు సంభవించి 40 ఇళ్లకు మంటలు అంటుకుంటున్నాయి. అయితే ఈ రెండు ఘటనల్లోనూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. 2021లో పశ్చిమ జావాలోని బలోంగన్ రిఫైనరీలో కూడా భారీ మంటలు చెలరేగాయి. 

Also Read: Greece train crash Update: 57కి చేరిన మృతుల సంఖ్య.. దేశవ్యాప్తంగా పెల్లుబికిన నిరసనలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News