Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌పై తాలిబన్ల ఆక్రమణ అనంతరం పరిస్థితులు మారిపోయాయి. ఆ దేశంలోని భారతీయుల రక్షణ ప్రశ్నార్ధకంగా మారింది. ఆ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న భారతీయుల్ని రక్షించే ప్రయత్నం ప్రారంభమైంది.
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల రాజ్యం(Taliban government)ఏర్పడింది. వివిధ దేశాలకు చెందిన ప్రజలు స్వదేశాలకు వెళ్లిపోవడం ప్రారంభమైంది. ఈ నేపధ్యంలో ఆఫ్ఘన్‌లో చిక్కుకున్న భారతీయుల్ని(Indians) రక్షించడం అనివార్యం కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్కడున్న భారతీయుల్ని తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. వైమానిక దళానికి చెందిన సీ 130 జే ప్రత్యేక విమానం 85 మంది ప్రయాణీకులతో అక్కడి నుంచి బయలుదేరింది. రీ ఫ్యూయలింగ్ కోసం తజకిస్తాన్‌లో ల్యాండ్ అయినట్టు సమాచారం. మరింతమందిని తరలించేందుకు మరో విమానం సిద్ధం చేశారు. సీ17 విమానంలో 180 మందిని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కాబూల్(Kabul)నగరం ప్రస్తుతం తాలిబన్ల(Talibans)చేతిలో ఉండటంతో ఎంతమంది విమానాశ్రయానికి చేరుకంటారనేది తెలియడం లేదు. ఎయిర్ ఇండియా విమానాల నిర్వహణ కష్టతరం కావడంతో వైమానికదళానికి (Indian Airforce)చెందిన విమానాల్ని నడపదలిచింది ప్రభుత్వం. ఇప్పటికే దౌత్యకార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిని ఇండియాకు తరలించారు. మరో వేయిమంది వివిధ ఆఫ్ఘన్ నిగరాల్లో చిక్కుకుపోయినట్టు సమాచారం. వీరందర్నీ గుర్తించడమే ఇప్పుడు కష్టంగా మారింది. ఆప్ఘన్‌లోని ఓ గురుద్వారాలో 2 వందలమంది వరకూ హిందూ, సిక్కు శరణార్ధులు ఉన్నట్టు సమాచారం.
Also read: Wild life Protection: దేశంలో ఏ జంతువులు, పక్షుల్ని పెంచడం నేరమో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook