అభినందన్ కు ఏమైనా జరిగితే ఖబర్దార్ ; పాకిస్తాన్ కు భారత్ హెచ్చరిక

                           

Last Updated : Feb 28, 2019, 11:34 AM IST
అభినందన్ కు ఏమైనా జరిగితే ఖబర్దార్ ; పాకిస్తాన్ కు భారత్ హెచ్చరిక

పాక్ చెరలో ఉన్న ఐఏఎఫ్ పైలట్ అభినందన్ వెంటనే విడుదల చేయాలని భారత్ విదేశాంగశాఖ డిమాండ్ చేసింది. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో ఢిల్లీలోని పాక్ విదేశాంగశాఖ డిప్యూటీ కమిషనర్ హైదర్ షాకు ఎన్ఐఏ బుధవారం సమన్లు జారీ చేసి వివరణ ఇవ్వాలని కోరింది. ఈ నేఫథ్యంలో ఆయన భారత విదేశాంగశాఖ అధికారుల సమక్షంలో హాజరయ్యారు.

హైదర్ షాకు నీలదీత

ఈ సందర్భంగా అభినందన్  పట్ల పాక్ వ్యవహరించిన తీరును భారత్ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ నిబంధనలు వ్యతిరేకంగా గాయపడ్డ అభినందన్ పట్ల పాక్ దురుసుగా ప్రవర్తించడం పట్ల భారత్ తీవ్రంగా ఖండించింది. పాక్ చెరలో ఉన్న అభినందన్ ను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా భారత్ కోరింది. అభిందన్ కు ఏమనైనా జరిగితే ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చింది.

తమ పోరాటం ఉగ్రవాదులపైనే..

పాక్ ఉన్న ఉగ్ర క్యాంపుల గురించి ఆ దేశానికి సమాచారం ఇచ్చామని..అయినా పాక్ వాటిపై చర్యలు తీసుకోకపోవడం వల్లే తాము రంగంలోకి దిగాల్సి వచ్చిందన భారత్ వివరణ ఇచ్చింది. తాము ఉగ్రవాదులపై దాడి చేశామే కానీ పాక్ ప్రజలపై కాదని భారత విదేశాంగశాఖ మరోమారు స్పష్టం చేసింది. 

Trending News